జీతాల కోసమే సమ్మె చేస్తున్నాం.. బ్యాంక్ ఉద్యోగుల ఆవేదన

Spread the love

(Banks Employees ఆవేదన… వైరల్ పోస్ట్ రూపంలో..)

ఔను.. మేము మా జీతాల కోసమే సమ్మె చేస్తున్నాం. తప్పేంఉంది ?? ఒక బ్యాంకు ఉద్యోగి ఉదయం 10 కి సీట్లో కూర్చుంటే మళ్లీ 2 గం.కి భోజనానికి లేస్తాడు. మళ్లీ 5 గంటలు దాటినా బయటకు వచ్చే పరిస్థితి లేదు. చాలా ప్రభుత్వ విభాగాలతో పోల్చుకుంటే అత్యంత పారదర్శకత, నిజాయితీలతో పనిచేసేది బ్యాంకుఉద్యోగులు మాత్రమే. మీలో ఎవరైనా ఎప్పుడైనా బ్యాంకులో పనికోసం లంచం ఇచ్చారా ?? ఔను.. ఒప్పుకుంటాం.. బ్యాంకులో మీకు క్యూలో కొంత టైం పడుతుంది…కానీ, పని ఖచ్చితంగా జరుగుతుంది..!! ప్రభుత్వ ఆఫీసుల్లో మీరు వెళ్లినరోజే మీపని ఎంతమందికి జరుగుతుంది భారత ప్రజలారా ??

ఔను.. మేము మా జీతాల కోసమే సమ్మె చేస్తున్నాం. తప్పేం ఉంది. మీ అకౌంట్ లొ ఉన్న డబ్బులలొ ఎప్పుడైనా తేడా వచ్చిందా? మీ స్కాలర్షిప్, గ్యాస్ సబ్సిడీ, పని పైసలు, రైతుబంధు పైసలు, మీకు వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు, ఆసరా పెన్షన్ డబ్బులు , వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, అమ్మవొడి, పసుపుకుంకుమ డబ్బులలొ తేడా వచ్చిందా?? రైతులు అమ్మిన ధాన్యం, పత్తి, వగైరా పైసలలొ తేడా వచ్చిందా ? విదేశాల నుండి మీ భర్త, కొడుకు పంపిన డబ్బులలొ తేడా వచ్చిందా? ఇది చాలాదా మా నిజాయితీ గురించి చెప్పటానికి ??

ఔను.. మేము మా జీతాల కోసమే సమ్మె చేస్తున్నాం. తప్పేం ఉంది. రిజిస్ట్రార్ ఆఫీస్, RTO ఆఫీస్ లలో ఏజెంట్లు ఆఫీస్ లలోనే తిరుగుతూ లంచాలు వసూలు చేస్తుంటారు. అలాంంటి వాళ్ళు కూడా జీతం పెంచమని అంటూఉంటే అత్యంత నిజాయితీ పరులమైన బ్యాంకు ఉద్యోగులం మేము జీతాలు పెంచమని సమ్మెచెస్తే తప్పేమిటి ?? ఇంకొ విషయం.. పాలవాళ్ళు, కూరగయల వాళ్ళు సమ్మె చేసినపుడు పాలు, కూరగాయలు రోడ్ పై పడేస్తారు. బ్యాంకువాళ్ళు డబ్బులు పడేయరు అనే జోక్ ఉంది. ఔను.. మేము పడెయము.. ఎందుకంటే బ్యాంకు లొ ఉన్నది మీ డబ్బు…అది మా స్వంతం కాదుకాబట్టే పడేయము..!!

ఔను.. మేము మాజీతాల కోసమే సమ్మెచేస్తున్నాం. తప్పేం ఉంది? సమాజంలొ ఎంతమంది ఉద్యోగస్తులకి వాళ్ల వాళ్ల జీతాలు సరిపోతున్నాయి ?? 2012 లో పెరగవలసిన మా జీతాలు 2015 లొ పెరిగాయి. 2017 లో పెంచవలసిన మా జీతాలు ఇప్పటి దాకా పెంచలేదు. 2017 నుండి ఇప్పటికి ధరలు ఎంత పెరిగాయి ?? ఒక ప్రభుత్వరంగ సంస్థలొ పనిచేస్తూ గౌరవప్రద జీవితం గడపాలి అంటే ఎంత జీతం కావాలో అంతే జీతం ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇవ్వమని అంటున్నాం… అయినా.. మా న్యాయపరమైన కోరికలను ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో మేము సమ్మెకు వెళ్తున్నాం…!! మరో విషయం.. అందరిలా కాకుండా మేము సమ్మెచేస్తే మా జీతాలు పోగొట్టుకుంటాం. జీతాలు పోగొట్టుకొని సమ్మెకు దిగుతున్నామంటే పరిస్థితి ఎంత దారుణమో అర్ధం చేసుకోండి. మానవతా దృక్పధంతో ఆలోచించండి. మాకు మీ సహకారం అందించండి. ఇది 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల ఆవేదన, ఆందోళన…!! అందుకే మేము సమ్మె చేస్తున్నాం…!!
✊🏻✊🏻✊🏻

(Visited 177 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *