విడుదలకు సిద్ధమైన “సంహారిని”

kekanews presents samharini movie news
Spread the love

శ్రీ లక్ష్మీ వృషద్దరి ప్రొడక్షన్స్, గీత ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ లో రాధికా కుమార స్వామి ప్రధాన పాత్ర లో రూపొందిన చిత్రం ” సంహారిని”
1980. లో ఒక రాజు కుటుంబంలో జరిగే కథ 2019 లో కూడా కొనసాగుతుంది. హారర్, కామెడీ. థ్రిల్లర్ తో రూపొందిన ఈ చిత్రానికి నవరసన్ దర్శకత్వం వహించారు. రాజు కుమార్తె దమయంతి పాత్రలో రాధికా కుమారస్వామి నటించారు, అలాగే రాజు పాత్రలో తమిళ సీనియర్ నటుడు నటించాడు. ఈ పాత్ర పేరు రాజ బహుదూర్ విజయేంద్ర వర్మ. ఈ చిత్రాన్ని బెంగళూర్, మైసూర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రంలో రాధిక కుమారస్వామి నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ చిత్రం కోసం మూడు అద్భుతమైన భారీ సెట్స్ వేసారు. విజువల్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన గ్రాఫిక్స్ వర్క్ తో ఈ చిత్రం ఉంటుంది. ఈ మూవీలో సందర్భానుసారం మూడు పాటలు ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకొని నవంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. చిత్రం విడుదల ముందు ఆడియో విడుదల చెయ్యనున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.

నటీనటులు:
రాధిక కుమారస్వామి
భజరంగి లోకి
సాధు కోకిల
తబల నాని
మిత్ర

సాంకేతిక నిపుణులు:

మ్యూజిక్: ఆర్.ఎస్. గణేష్ నారాయణ్
కెమెరామెన్: పి.కె.హెచ్.దాస్
ఎడిటింగ్: మహేష్ రెడ్డి
సమర్పణ: శ్రీ లక్ష్మీ వృశుద్ధరి ప్రొడక్షన్స్

కథ
స్క్రీన్ ప్లే
దర్శకత్వం: నవరసన్

KekaNews presents Samharini movie news

(Visited 122 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *