మూవీ రివ్యూ : రాజావారు – రాణిగారు

raja varu rani varu review
Spread the love

ప్రేమకథలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి., కానీ ప్రతి ప్రేమ కథలోనూ ఒక ట్విస్ట్ కచ్చితంగా ఉంటుంది. పాతతరం కథలు నుంచి నేటి కాలం లవ్ స్టోరీస్ చాలా వరకూ విజయాలు నమోదు చేసుకున్నాయి. ప్రేమ కథను ఏ దర్శకుడు వెండితెరపై కొత్తగా చూపిస్తే ఆ సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. తాజా వచ్చిన ఓ కొత్త చిత్రం రాజావారు రాణిగారు. ఈ చిత్రంపై బాక్సాఫీసు ముందు సక్సెస్ అయిందా? లేదా? అనేది చూద్దాం..

కథ:

రాజా(కిరణ్) అనే కుర్రాడు, రాణి(రహస్య గోరక్ ) అనే అమ్మాయి శ్రీరామపురం అనే గ్రామంలో ఉంటారు. రాజాకి రాణి అంటే వల్లమాలిన ప్రేమ. కానీ, ఆ విషయం రాణికి చెప్పాలంటే చాలా భయం. రాజా తన ప్రేమ విషయం చెప్పేలోగా ఇంటర్ పరీక్షలు ముగుస్తాయి. రాణిని పై చదువుల కోసం పట్టణం పంపిస్తారు వాళ్ల నాన్న. రాణి ఊరు విడిచివెళ్లేటప్పుడు రాజావైపు చూస్తూ చిరునవ్వునవ్వి వెళ్తుంది. దీంతో రాణినే తలచుకుంటూ జీవితస్తుంటాడు రాజా.

మూడేళ్లు గడిచిన రాణి ఊళ్లోకి ఏప్పటికైనా వచ్చి తన ప్రేమని ఒప్పుకుంటుంది ఆశతో రాజా జీవిస్తుంటడు. రాజా స్నేహితులు రాణిని శ్రీరామపురం రప్పించడానికి ఒక మంచి ప్లాన్ వేస్తారు. రాజా స్నేహితులు వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యి రాణి ఊరికి వస్తుంది. ఊరికి తిరిగి వచ్చిన రాణికి తన మనస్సులో ఉన్న మాటను రాజా తెలియజేసాడా? అసలు రాజాని రాణి ప్రేమిస్తుందా? రాజా ప్రేమను రాణి ఒప్పుకుంటుందా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

ప్రతి పల్లేటూరి కథలో కాస్తో కూస్తో పాత వాసనలు ఉండడం సహాజం. అయితే ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో తీయడంలోనే దర్శకుడి నైపుణ్యం ఉంటుంది. ఈ సినిమాలోని కొంత భాగాన్ని 90లలో నడిపించడం ద్వారా అప్పటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక ఆ సీన్స్ బోర్ లేకుండా కామెడీ ఉండేలా చూసుకోవడంతో సినిమా సాఫిగా సాగుతుంది. మొదటి భాగంలో హీరోయిన్ పాత్ర తక్కువగా ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా తెరకెక్కించారు. ఓ చిన్న పాయింట్‌ తీసుకుని సినిమా కంటెంట్‌పై దర్శకుడు ఎంత దృష్టి పెట్టారో అర్థం చేసుకోవచ్చు.

ప్రదమార్ధం బాగా నడిచిన సినిమా, ద్వితీయార్థం కూడా అదే పాయింట్ మీద సాగుతుంది. ఒకే లైన్‌పై నడుస్తుండడం, కథలో ఎలాంటి అనుకోని మలుపులు లేకపోవడంతో సినిమా రొటీన్ గా అనిపిస్తుంది. సినిమా స్లోగా నడవడంతో లవ్ ఫీల్ అనేది పెద్దగా వర్క్ పనిచేయలేదు. సినిమా చివరికి వచ్చేసరికి రాణి, రాజా మధ్య లవ్ ఫీల్ పూర్తిగా పక్కదారి పడుతోంది. పేక్షకులకు మంచి సినిమా చూశాం అనే భావన కలుగుతోంది కానీ ఏక్కడో చిన్న వెలితి అలానే ఉండిపోతుంది.

ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది కొత్తగా అనిపించే పల్లెటూరి కామెడీ గురించి. సినిమా మొత్తం కనిపించే రాజా స్నేహితులు నాయుడు, చౌదరి పాత్రలు ఎంటర్టైన్ చేస్తాయి. ‎ మ్యూజిక్ బాగుండడంతోపాటు, పల్లెటూరి అందాలను బంధించిన కెమెరామెన్ పనితీరు ఓ మంచి అనుభూతినిస్తాయి. రాజావారు రాణిగారు ప్రేమకథ డీసెంట్ ఎంటెర్‌టైనర్ గా నిలుస్తోందనే చెప్పాలి. మంచి అనుభుతితో ప్రేక్షకులను రెండు గంటల పాటు కూర్చొబెట్టిన దర్శకుడిని దగ్గర విషయం ఉన్నట్టుగానే చెప్పాలి.

సాంకేతికంగా

ఈ సినిమాలో ప్రతిఒక్కరు కొత్తవాళ్ళే. కథను నమ్మి దానిని తీర్చదిద్దడంలో కొత్త డైరెక్టర్ కోలా రవికిరణ్ పనితీరు మెచ్చుకోవాలి. మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ పాటలు మంచి ఫీల్‌తో సాగుతాయి. కొన్ని సన్నివేశాల్లోని పాటలు కంటెంట్‌ని ఎలివేట్ చేస్తాయి. ఛాయాగ్రహణం కూడా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సినిమాకి విద్యాసాగర్ చింతా, అమర్ దీప్ గుత్తుల ఛాయాగ్రహణం అందించారు. పల్లెటూరి అందాలను కెమెరాలో బంధించిన తీరు అద్భుతంగా ఉంది.

నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇందులో బిడియం ఉన్న కుర్రాడిగా, తన ప్రేమను వ్యక్తపరచలేని అబ్బాయిగా కిరణ్ అబ్బవరం యొక్క పరిణతితో కూడిన నటన, మనల్ని ఆకట్టుకుంటుంది.ఇది అతని మొదటి సినిమా అంటే అస్సలు నమ్మలేం.తెరమీద ప్రతి ఒక్కరూ తమని తాము చూసుకునే పాత్ర కావడం తో సహజత్వం ఉట్టిపడే పాత్రలో కిరణ్ అబ్బవరం నటన ప్రశంసలందుకుంటుంది. ఇక అతనికి తోడుగా మిత్రులుగా చేసిన చౌదరి, నాయుడు ల నటన సినిమాకు కావలసిన వినోదాన్ని పుష్కలంగా అందించింది.

ఈ సినిమాలోని మిగత పాత్రలు చేసిన వారంతా వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాను మొత్తం ఫ్రెష్ నెస్ నింపింది. సినిమా విషయంతో నిర్మత మనోవికాస్.డి ఎక్కడా రాజీపడలేదు. సురేష్ ప్రొడక్షన్స్ సహాకారం సినిమాకు మంచి మైలేజ్ ఇచ్చింది. ఓవరాల్‌గా చూస్తే సినిమా మంచి రిఫ్రెషింగ్ గా ప్రేక్షకులకు అనిపిస్తుంది.

Rating: 3.5/5

(Visited 114 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *