మూవీ రివ్యూ : ఒక చిన్న విరామం

Spread the love

చిత్రం: ఒక చిన్న విరామం
నటీనటులు: సంజయ్ వర్మ, నవీన్ నేని, పునర్నవి భూపాలం, గరిమ సింగ్,ఆల్విన్ బత్రం

దర్శకత్వం: సందీప్ చేగురి
కెమెరామెన్: రోహిత్ బెచు
మ్యూజిక్: భరత్ మాచిరాజు
ఎడిటర్: అస్వంత్ శివకుమార్
డిఐ & డబ్బింగ్: అన్నపూర్ణ స్టూడియోస్
టెక్నీకల్ హెడ్: సివి.రావు
కలరీస్ట్: వివేక్
ప్రొడ్యూసర్: సందీప్ చేగురి
ప్రొడక్షన్: మూన్ వాక్ ఎంటర్త్సైన్మెంట్స్

సంజయ్‌ వర్మ, గరిమా సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ ఒక చిన్న విరామం. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ లో తెలుసుకుందాం.

కథ:
దీపక్ (సంజయ్ వర్మ) కు ఒక అపరిచిత వ్యక్తి నుండి అనుమానాస్పద కాల్ వస్తుంది. తాను డబ్బు కోసం దీపక్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. డబ్బును ఇవ్వడానికి దీపక్ కార్ లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. దారిలో కార్ రిపేర్ అవుతుంది. అపరిచిత వ్యక్తి దీపక్ కు ప్రతి అరగంటకు ఒకసారి కాల్ చేసి ఇబ్బంది పెడుతుంటారు. దీపక్ చివరికి ఏం చేశాడు ? ఈ కథలో అసిస్టెంట్ డైరెక్టర్ బాలా (నవీన్ నేని) , ఆర్టిస్ట్ మాయ (పునర్నవి భూపాలం) , సమీరా (గరీమ సింగ్) ఎలా వచ్చారు ? చివరికి వీరందరూ ఏం సాధించారు అనేది తెలుసుకోవాలంటే ఒక చిన్న విరామం చూడాల్సిందే.

విశ్లేషణ:
డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో  తెరకెక్కిన ఈ సినిమాలో  మంచి సందేశంతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ విజువల్స్ బాగున్నాయి. కచ్చితంగా ఈ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. దర్శకుడు సందీప్ చేగురి రాసుకున్న కథ, కథనాలు బాగున్నాయి. నైట్ ఎఫెక్ట్ లో తీసిన సన్నివేశాలు బాగున్నాయి. హీరోగా నటించిన సంజయ్ వర్మ చక్కగా నటన బాగుంది. సంజయ్ వర్మ  సరసన  హీరోయిన్ గా  నటించిన గరీమ సింగ్ తన హోమ్లీ లుక్స్ లో తన పాత్ర మేరకు నటించి మెప్పించారు. కమెడియన్ నవీన్ నేని తన కామెడీ టైమింగ్ తో సినిమాకే హైలైట్ గా నిలిచాడు. తన సన్నివేశాలు వస్తున్నప్పుడు ఆడియన్స్ థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు. మరో కీలక పాత్రలో కనిపించిన  పునర్నవి భూపాళం కూడా  తన  పాత్రకు న్యాయం చేసింది. తన నటనతో మరింత అందం తెచ్చింది. దర్శకుడు మంచి విజువల్ సెన్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు.

మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మాచిరాజు  అందించిన  సంగీతంతో పాటు నేపధ్య సంగీతం అదిరిపోయింది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. రోహిత్ బెచు కెమెరా వర్క్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. విజువల్స్ ను ఆయన  చాలా అందంగా  చూపించారు. దర్శకుడు సందీప్ చేగురి సరైన స్క్రిప్ట్ ను రాసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఆయన దర్శకత్వం మెచ్చుకోదగిన విధంగా ఉంది.  ఇక నిర్మాతగా కూడా సందీప్ చేగురి  పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

‘ఒక చిన్న విరామం’ అంటూ  వినూత్నమైన  కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం రసవత్తరంగా సాగుతుంది.  ట్రీట్మెంట్ తో  పాటు లాజిక్స్ బాగున్నాయి. కొన్ని పాత్రలు నవ్వించడం, అలాగే దర్శకుడు తీసుకున్న కథాంశం వంటి అంశాలు బాగున్నాయి. సినిమాలో  నాటకీయత పరిది మేరకు ఉంది, మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలంగా ఉండటం, పైగా  సినిమాలో రియల్ ఎమోషన్స్  వంటి అంశాలు  సినిమా ఫలితాన్ని పెంచాయి.

చివరగా: ఒక చిన్న విరామం ఒక మంచి ప్రయత్నం

రేటింగ్: 3.5/5

(ADVT)

(Visited 161 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *