తండ్రికి వారసుడి సలహాలు

Spread the love

దర్శకుడు శివనాగుకు తనయుడు సుప్రీమ్ సలహాలు

సూపర్ స్టార్ కృష్ణ గారితో “ఈతరం నెహ్రూ” సినిమా తీసి సంచలన విజయం సాధించిన దర్శకుడు శివనాగు ఆ తర్వాత ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేశారు. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, ఫ్యాంటసీ, థ్రిల్లర్, మాఫియా లాంటి విభిన్న కథలతో సినిమాలకు దర్శకత్వం వహించారు రాకింగ్ డైరెక్టర్ శివనాగు. కొన్ని చిత్రాలకు నంది అవార్డులు కూడా సాధించారు.

శివనాగు మెగాస్టార్ చిరంజీవి అభిమాని అవటం వల్లనే తన కొడుకుకి సుప్రీమ్ అనే పేరు పెట్టారేమో. సుప్రీమ్ కూడా తన పేరుని పుణికి పుచ్చుకుని చిన్నతనం నుండి బాల నటుడిగా నటించడమే గాక “లిటిల్ బుద్ద”, “మాస్టర్ మైండ్స్” చిత్రాలతో అవార్డులు కూడా అందుకున్నాడు.

15వ ఏడు వచ్చేసరికి “జగదేకవీరుడు అతిలోకసుందరి” లాంటి ఫాంటసీ చిత్రం “వనకన్య వండర్ వీరుడు” లో అప్పటి ప్రముఖ నటి ఆర్తి అగర్వాల్’తో కలిసి నటించి వండర్ వీరుడిగా మెప్పించాడు.

ఆ తర్వాత ఒక యూత్ సినిమా “బాయ్ ఫ్రెండ్” లో నటించి తెలుగు, తమిళ యువ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు ఫారిన్ లో (లండన్)లో MBBS చేస్తున్నాడు. అక్కడి నుండే తన ఫాదర్ శివనాగుకి కథల విషయంలో సలహాలు ఇస్తూ ఉంటాడు.

ఆ సలహాలు పాటిస్తూ, కథల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ “అన్నపూర్ణమ్మ గారి మనవడు”ని తెరకెక్కించారు శివనాగు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా బాగా వచ్చిందనీ, చరిత్రలో నిలిచిపోయే చక్కని కుటుంబ కథా చిత్రం అవుతుందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి హిట్ కాబోతోందనీ సినీ వర్గాల భోగట్టా.

మరి ఆయన తనయుడు సుప్రీమ్ ఫారిన్ నుండి వచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లో చేస్తాడా? డాక్టర్ గా స్థిర పడతాడా అనేది వేచి చూడాల్సిందే.

(Visited 50 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *