KCR Asaduddin : కేసీఆర్ హయాంలో మూసీ ప్రక్షాళన పేరుతో ప్రణాళికలు సిద్ధం చేసినప్పుడు తాము వ్యతిరేకించామని, ఆ ప్రణాళికలు వద్దని చెప్పామని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ గుర్తు చేశారు. అయితే, ఆ విషయాన్ని మరచిపోయి కాంగ్రెస్ తో తాము చేతులు కలిపామని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ నాయకుల జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయ్.. నాతో పెట్టుకోకండి.. నేను నోరు విప్పితే మీరు తట్టుకోలేరు.. అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Shubha Muhurtham : నవంబర్‌లో 10.. డిసెంబర్‌లో 8 మంచి ముహూర్తాలు.. తేదీలు తెలుసుకోండి
మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని అన్నారు అసదుద్దీన్. తాము కాంగ్రెస్ పార్టీతో జతకట్టామని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నదని, కానీ గతంలో తమ మద్దతుతోనే మీరు గ్రేటర్ ఎన్నికలలో గెలిచారు కదా? అని ప్రశ్నించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై, బీఆర్ఎస్ నేతలపై శనివారం ఓవైసీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. పదేళ్ళపాటు మీరు అధికారంలో ఉన్నపుడు మీరు చేసిన ఘనకార్యాల చిట్టా అంతా తన దగ్గర ఉన్నదని, మరోసారి నోరు పారేసుకుంటే వాటిని బయటపెట్టక తప్పదని హెచ్చరించారు. నేను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బంది పడతారని అన్నారు.
పెళ్లయినా.. కాకపోయినా కొడుకెంతో.. కూతురూ అంతే..! కోర్టు ఆదేశాలు
కేటీఆర్, హరీష్ వులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అసద్. ఇళ్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలన్నారు. ఆ పార్టీకి జీహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు తమ వల్లే వచ్చాయని అన్నారు. ఎంఐఎం మద్దతుతోనే బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. 24 మందిని మార్చి ఉంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిచేదని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రా యపడ్డారు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు అహంకారం ఉండేదన్నారు. తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి పోతున్నామని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తో కలిసి జీహెచ్ఎంసీలో పాగా వేయాలన్న మజ్లిస్ ఆశల కారణంగానే.. బీఆర్ఎస్ పై అసదుద్దీన్ స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి మజ్లిస్.. కాంగ్రెస్ తో స్నేహంగానే ఉంటోంది. రాబోయే పరిణామాలు ఎదుర్కొనేందుకే ముందునుంచే అసదుద్దీన్ కొత్త వ్యూహంతో వెళ్లాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని.. అందుకే కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటూనే బీఆర్ఎస్ పై గట్టిగానే ఎక్కుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.