Shubha Muhurtham : 2024 ఏడాది చివరికొచ్చేసింది. సంక్రాంతి తర్వాత మూఢాలు ఉండటంతో.. నవంబర్, డిసెంబర్ లోని మంచి ముహూర్తాల్లోనే శుభకార్యాలు, కార్యక్రమాలు పూర్తిచేయాలని చాలామంది భావిస్తున్నారు. ఈ ముహూర్తాలు దాటిన తర్వాత సంక్రాంతి మూఢాలు వస్తాయి. మళ్లీ శుభకార్యాలకు ఫిబ్రవరి, మార్చి నెల వరకు ఆగాల్సి ఉంటుంది.
పెళ్లయినా.. కాకపోయినా కొడుకెంతో.. కూతురూ అంతే..! కోర్టు ఆదేశాలు
నవంబర్ నెలలో 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయి. డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వీటిలో నవంబర్ 8, డిసెంబర్ 6 అత్యంత శుభ ముహూర్తాలు అని పండితులు చెబుతున్నారు.
Kanguva : దిశా పటానీ డీప్ క్లీవేజ్.. సీన్ డిలీట్.. సెన్సార్ బోర్డ్ అభ్యంతరం
నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుస ముహూర్తాలతో కళ్యాణ మండపాలకు డిమాండ్ భారీగా పెరిగింది. నెల రోజుల ముందే బుకింగ్స్ అయిపోయాయని నిర్వాహుకులు చెబుతున్నారు. కొన్నిచోట్ల కళ్యాణ మండపాల నిర్వాహుకులు.. కంబైన్డ్ ప్యాకేజీలు ఇస్తున్నారు. కేటరింగ్, మండపం డెకరేషన్, సురోహితులు, బ్యాండ్ ఇలా అన్ని కలిపి ఒక ప్యాకేజీ రూపంలో చెబుతు న్నారు. ప్రాంతాన్ని బట్టి కళ్యాణ మండపాలకు రూ.40 వేలనుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. అలాగే దీపావళి, పెళ్లిళ్ల ముహూర్తాలు ఉండడంతో బంగారం, వస్త్ర, ఇతర సామాగ్రి దుకాణాలు రద్దీగా ఉంటున్నాయి. సంపన్నులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లి ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లు బంగారం కోసం స్థానిక జ్యువెలర్స్ షాపులకు వెళ్తున్నారు. మంచి రోజులు 18 రోజులు ఉండటంతో.. మీ ప్రోగ్రామ్ ఎప్పుడో మీరే ఫిక్స్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.