Prashant Kishor : రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ కు పెట్టింది పేరు. ఎన్నికల, రాజకీయ వ్యూహాల్లో ఆయన దిట్ట. సక్సెస్ ఫుల్ పొలిటికల్, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గా ఆయనకు చాలా పేరుంది. ఐతే.. తన ప్రచారానికి టెంట్లు, గొడుగులు వేయడానికి కూడా డబ్బులు లేవని వస్తున్న విమర్శల నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త, జనస్సురాజ్ పార్టీ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్.. తొలిసారి తాను తీసుకునే ఫీజును వెల్లడించారు.
Shubha Muhurtham : నవంబర్‌లో 10.. డిసెంబర్‌లో 8 మంచి ముహూర్తాలు.. తేదీలు తెలుసుకోండి
ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడికి ఎన్నికల సలహా ఇస్తే రూ.100 కోట్ల వరకు ఫీజుగా వసూలు చేస్తానని చెప్పారు ప్రశాంత్ కిశోర్. బీహార్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఫీజు విషయాన్ని బహిర్గతం చేశారు. ప్రస్తుతం 10 రాష్ట్రాల ప్రభుత్వాలు తన వ్యూహాలను అనుసరిస్తున్నాయని తెలిపారు.
KCR Asaduddin : బీఆర్ఎస్‌పై రెచ్చిపోతున్న అసద్.. అసలు కారణం ఇదే
బీహార్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న బై ఎలక్షన్స్ జనురాజ్ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టింది. బెలాగంజ్ నుంచి మహ్మద్ అన్జద్, ఇమామ్ గంజ్ నుంచి జితేంద్ర పాశ్వాన్, రామ్ గఢ్ నుంచి సుశీల్ కుమార్ సింగ్ కుష్వాహా, తరారీ నుంచి కిరణ్ సింగ్ అభ్యర్థులుగా ఉన్నారు. ఈ నెల 13న ఉప ఎన్నికలు జరుగుతుండగా.. 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తన ఫీజు ప్రకటన బీహార్ అంతటా హాట్ టాపిక్ గా మారింది.