Maharashtra : మహారాష్ట్ర ఎన్నికల ప్రచా రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శలు తీవ్రమయ్యాయి. తాజాగా కాంగ్రెస్ అధ్య క్షుడు మల్లికార్జున్ ఖర్గేపై యూపీ సీఎం
యోగి ఆధిత్యనాథ్ పదునైన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఓట్ల కోసం ఆయన కుటుంబ త్యాగాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు.
Ashu : ఏమి షేపురో..! సోషల్ మీడియాను తగలబెట్టేస్తున్న అషు రెడ్డి
మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గంలో మంగళవారం ఏర్పాటు చేసిన భాజపా ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖర్గే బాల్యం నాటి విషాద సంఘటనను ప్రస్తావించారు.
హరహర శంభోశంకర.. శివయ్యకు వానరం ప్రణామం.. వైరల్ ఫొటో ఎక్కడిదో తెలుసా
భారత్ లో బ్రిటీష్ వారి పాలన కొనసాగు తున్న సమయంలో, హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో ఉండేదన్న సంగతి తెలిసిందే. ఖర్గే కుటుంబం నివసించిన గ్రామం కూడా నిజాం ఆధీనంలో ఉండేది. నాడు హిందువులను లక్ష్యంగా చేసుకుని రజాకార్లు దాడులకు పాల్పడ్డారు. అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన ఇల్లు కాలిపోయింది. ఖర్గే తల్లిసహా కుటుంబ సభ్యులంతా ప్రాణాలు కోల్పో యారు అని యోగి గుర్తుచేశారు.
Ananya Nagalla : అనన్య జోరు.. మెగా హీరోతో మరో సినిమా
ఈ సంఘటన ఖర్గేకు కచ్చితంగా గుర్తుకు ఉండేవుంటుంది. కానీ, ఆయన ఈ విషయం మాట్లాడటం లేదు. ఎందు కంటే.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఓ వర్గం కాంగ్రెస్ కు దూరం అవుతుంది. అందుకే ఆయన దాని గురించి నోరుమెదపరు. ఓట్ల కోసం కుటుంబ త్యాగాన్ని కూడా మరచిపోయారు అంటూ విమర్శలు గుప్పించారు.
Meenakshi Chaudhary : సూపర్ ఫిగర్ ఉన్నా బ్రేక్ కోసం మీనాక్షి చౌదరి ఎదురుచూపులు.. Photo Gallery
కాగా, ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖర్గే బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు సాధువుల వేషధారణలో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారని, ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. దీనికి కౌంటర్గా యోగి ఖర్గేకు దీటుగా బదులిచ్చారు.