సీఈసీ కాళరాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..? ఎలా బతికారు?

CEC Rajiv Kumar : కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి(CEC Rajiv Kumar) రాజీవ్ కుమార్ తన జీవితంలో మరువలేని చేదు అనుభవాన్ని చవి చూశారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఆయన ఉత్తరాఖండ్ లోని ఒక మారుమూల కుగ్రామానికి వెళ్లాలని సంకల్పించి, వెళ్లి తీరా అక్కడ ఒక రాత్రంతా.. ఆగిపోవాల్సి వచ్చింది. దాదాపు 17 గంటల పాటు చలిలో గడపాల్సి వచ్చింది.

Salman Khan : సల్మాన్ ఖాన్.. లారెన్స్ బిష్ణోయ్.. మధ్యలో జింక..! ఒళ్లు గగుర్పొడిచే స్టోరీ

అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా లేదు. ఆయన వద్ద ఒక శాటిలైట్ ఫోన్ మాత్రమే ఉంది. ఎన్నికల సమయంలో తమ సిబ్బంది ఎలాంటి కష్టనష్టాలను భరిస్తుంటారో స్వయంగా అధ్యయనం చేసే ఉద్దేశంతో ఆయన ఆ పర్యటనకు వెళ్లారు. 12000 అడుగుల ఎత్తులో ఎడారిలాంటి ఒక గ్రామంలో చిక్కుకుపోయారు. బయలుదేరిన అరగంట లోనే వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ ఆగిపోయింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత. గడ్డ కట్టేంతగా చలి. కరెంట్ లేదు. కారు చీకటి. ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్ రీజియన్ లో మిలామ్ అనే ప్రాంతానికి ఆయన తన టీమ్ తో హెలి కాప్టర్లో బయలుదేరారు. ఇద్దరు పైలట్లు, మరో ఇద్దరు సిబ్బంది వెంట ఉన్నారు. మధ్యాహ్నం వేళ బయలుదేరారు. అయితే మధ్యలోనే రాలమ్ అనే గ్రామంలో అత్యవసరంగా హెలికాప్టర్ దిగాల్సి వచ్చింది.

 

వాతావరణం అనుకూలించలేదు. ఆకాశం మేఘావృతమై చీమ్మ చీకటి అలుముకుంది. ఆ గ్రామంలో పిట్టపురుగు లేదు. వేసవిలో మాత్రమే అక్కడ జనసంచారం. చలికాలంలో వలస వెళ్లిపోతారు. అందువల్ల అక్కడ పలకరించే దిక్కు కూడా లేకుండా పోయింది. వారికి అత్యవసర వసతులకు సైతం అవకాశం లేకుండా పోయింది. అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్ండే, మరొక సహచరుడు, ఇద్దరు పైలట్లు సాయంత్రం అయిదింటి దాకా దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. కాకతాళీయంగా బెంగళూరుకు చెందిన ఇద్దరు ట్రెక్కర్లు వీరిని గమనించారు. వెళ్లి పలకరించారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు.

 

సమీపంలోని ఒక ఇంటి తలుపులు తెరిచి వారిని లోపల కూచోబెట్టి, వారివద్ద ఉన్న ఇనెంట్ నూడుల్స్, డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు. ఆ రాత్రంతా చలిని తట్టుకునేందుకు మంట రాజేశారు. సమీపంలోని ఐటిబిపి పోస్టులకు సమాచారం ఇచ్చారు. పితోరాగఢ్ జిల్లా మేజిస్ట్రేట్ తదనంతర చర్యలు తీసుకున్నారు. ఈలోగా ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హెలికాప్టర్ చిక్కుకున్న విషయం తెలిసి అక్కడికి చేరుకున్నారు. ఎనిమిది కిలో మీటర్ల దూరం నుంచి రాత్రి ఒంటిగంటకు ఒక గ్రామ ప్రధాన్ వచ్చారు. డ్రై ఫ్రూట్స్ తదితర ఆహారపదార్ధాలు తెచ్చి ఇచ్చారు. మర్నాడు తెల్లవారుజామున ఐదింటికి ఐటిబిపి దళ సభ్యుల బృందం లైఫ్ సేవింగ్ పరికరాలు, ఆహారపదార్ధాలతో అక్కడికి చేరుకున్నారు.

Pottel : పొట్టేల్.. కొత్త సినిమా ట్రైలర్ అదిరింది

ఉదయం ఆరింటికి వాతావరణం క్లియర్ అయ్యాక సమీపంలోని ఐటిబిపి రెస్ట్ హౌస్ కి వెళ్లారు. ఆతర్వాత అక్కడినుంచి సీఈసీ రాజీవ్ కుమార్ బృందం ఢిల్లీ వెళ్లారు. గత బుధవారం అక్టోబర్ 16న మధ్యాహ్నం మొదలైన ఈ చేదు అనుభవం గురువారం ఆయన ఢిల్లీ చేరడంతో సుఖాంతమైంది. స్థానికులు ఆ విపత్కర స్థితిలో తమకు చేదోడుగా నిలిచారంటూ ఎన్నికల ప్రధానాధికారి ప్రశంసించారు.

(Visited 6 times, 1 visits today)
Author: