Lyrics | హత్తుకునే పాట.. అద్భుతంగా పాడింది | బంధాల బంధాలు తెంచుతుండు

Bandhala bandhalu thenchuthundu

Heart Touching song ను అంతే హృద్యంగా పాడింది ఓ పల్లెటూరి స్కూల్ అమ్మాయి. బంధాల బంధాలు తెంచుతుండు.. మనిషి జంతువై జగములో బతుకుతుండు.. అనే పాటను ఆ చిన్నారి అద్భుతంగా పాడింది. ఆ పాట.. కింద లింక్ లో చూడొచ్చు.. ఆ సాంగ్ లిరిక్స్ కింద చూడొచ్చు.

మనసును హత్తుకునే ఈ సాంగ్ ను తిరుపతి మాట్ల రాశారు. ఆయనకు అభినందనలు. అమ్మాయి ప్రతిభకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు.

#Lyrics #Bandhala Bandhalu Techuthundu

బంధాల బంధాలు తెంచుతుండు మనిషి
జంతువై జగములో బ్రతుకుతుండూ..

కోరికల కోరలే చాచుతుండూ
మనిషి రాక్షసా రాజ్యాన్ని ఏలనుండూ…||బంధాల||

వయసువశమూదప్పి
మనసుకే మసిబారి
యువతరము చెడుదారి పడుతున్నరూ
క్షణకాల సుఖమునూ పొందగోరి అయ్యొ
పసిమొగ్గలా ఉసురు దీస్తున్నరూ
తుమ్మముల్లమ్మ పొత్తిల్లుగా
అయ్యొ చెత్తకుప్పలు ఐనవాల్లుగా
దిక్కులేని చావు చస్తుండ్రు పిల్లలు
కుక్కలకు ఆహారమౌతున్నరూ..||బంధాల||

పేగుబంధంపైన పెడబుద్ధితో ఒకడు
మృగమై పంజాను విసురుతుండూ
తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరిచి
పశువల్లె పసిదాన్ని చెరుపుతుండూ
అరచేతులాడించె నాన్న
కడకు కరిచేను విషనాగుతీరునా
రక్తబంధం రక్తసిక్తమయ్యి
రాబందులకు బందియై పోతున్నది….||బంధాల||

ఆడబిడ్డలు పుడితె కీడనీ నమ్మేటి
పాడుదినములు తాండవిస్తున్నయో
బొడ్డూడనీ బిడ్డనూ బండకేగొడితె
పసిగుండెపగిలి నెత్తురుజిమ్మెనూ
ఆడజన్మెత్తుటే పాపమా
అదీ.. ఆబిడ్డపాలిటా శాపమా..
కృర జంతువులైన కంటతడి పెట్టేల
పాలబుగ్గలను చిదిమివేస్తున్నరూ….||బంధాల||

ప్రేమనే ముడిసరుకు పెట్టుబడిగా బెట్టి
బంధాలతో బ్యారమాడుతుండూ
కట్నాల పేరిటా గిట్టుబాటుధరకు
గట్టిగా నిలిచి కొట్లాడుతుండ్రూ
వ్యాపారమే మనిషి జీవితం
మానవత్వమౌతుంది భూస్థాపితం…..
బంధాలను బోందవెట్టెదిశగా
మనిషి యంత్రమైసాగించుతుండు పయణం.. ||బంధాల||

 

(Visited 2,502 times, 1 visits today)
Author: