(Find Song Link below the article)
Pushpa 2 Kissik : సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ రానుంది. సుమారు మూడు సంవత్సరాల తర్వాత రానున్న ఈ సీక్వెల్ పై ప్రేక్షకులకు, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ అలాగే పాటలు ఎంతో బజ్ తెప్పించాయి. ఇటీవలే పాట్నాలో టైలర్ లంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గా సుమారు మూడు లక్షల మందికి పైగా హాజరవుతూ ఈవెంట్ నిలిచింది.
ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్స్ దేశవ్యాప్తంగా చేయడానికి చిత్ర బృందం నిర్ణయించుకుంది. అదే సందర్భంగా ఈరోజు తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వైల్డ్ ఫైర్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. చెన్నైలోని సాయి రామ్ ఇంజనీరింగ్ కళాశాలలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియం ఆవరణలో ఈ భారీ స్థాయి ఈవెంట్ ను చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏజెఎస్ ఎంటర్టైన్మెంట్స్ అర్చన కల్పాతి గారు మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, పుష్పా టీంకు, ప్రేక్షకులకు అందరికీ ఏజెఎస్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ తరఫున నమస్కారం. ఏజిఎస్ ను నమ్మి ఇంత గొప్ప సినిమాను మాకు ఇచ్చినందుకుగాను నవీన్ గారికి,రవి గారికి ధన్యవాదాలు. ఇంత పెద్ద సినిమాను తమిళనాడులో మా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాము. సుమారు 600 స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాము. మొదటి రోజున 3500 షోలు వేయనున్నాము. నాకు దర్శకుడు సుకుమార్ గారు అంటే ఎంతో అభిమానం. ఆయన సినిమాలు, వాటిలో ఆయన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసే విధానం నాకు ఎంతగానో నచ్చుతుంది. అల్లు అర్జున్ గారు, రష్మిక మందన్న గారి పర్ఫామెన్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. దేవిశ్రీ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సబ్ డిస్ట్రిబ్యూటర్స్ కు, డిస్ట్రిబ్యూటర్ హెడ్లకు ధన్యవాదాలు. డిసెంబర్ 5వ తేదీన ఈ జీవితాన్ని తప్పకుండా చూడండి” అన్నారు.
మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ గారు మాట్లాడుతూ… “పుష్ప టీం తరఫున ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ ను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకు అలాగే ఏజీఎస్ నిర్మాతలకు, నెల్సన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. గత రెండు సంవత్సరాలకు చిత్ర బృందం ఈ సినిమాను పూర్తి చేయడానికి గనుక ఎంతగానో కష్టపడుతూ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి అన్ని అంశాలు పెద్దవే. అలాగే చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ వారి పూర్తిస్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వడం జరిగింది. పుష్ప 1తో ఫైర్ మొదలు పెట్టి పుష్ప 2తో వైల్డ్ ఫైర్ వచ్చేలా చేశారు. అల్లు అర్జున్ డిసెంబర్ 5 నుండి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రూల్ చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ఈ సినిమాతో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంటారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు. దర్శకుడు సుకుమార్ తో మేము ఇప్పటికే మూడు చిత్రాలకు కలిసి పని చేసాము. ఆయన ఎంతో మిషనరీ ఉన్న దర్శకుడు. ఆయనతో పనిచేయడం మాకు సంతోషకరం. సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు అలాగే ఈ చిత్ర బంధం అందరితో పని చేయడం మాకు సంతోషకరం. దేశంలోనే అతిపెద్ద సినిమాను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లి వెళ్తున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. పుష్ప 1, పుష్ప 2 చేసాము. పుష్ప 3 చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. డిసెంబర్ 2 తేదీన తప్పక పుష్ప 2 చిత్రాన్ని థియేటర్లో అందరూ చూడాలి” అన్నారు.