YouTube రూల్స్ మళ్లీ మారాయి.. తెలుసుకోండి

YouTube Monetization Policy New rules
Spread the love

యూట్యూబ్ రోజురోజుకూ విస్తృతి పెంచుకుంటోంది. క్రియేటర్స్ పెరిగిపోవడంతో.. జీబీలు జీబీల కంటెంట్ అప్ లోడ్ అవుతోంది. మానెటైజేషన్ పాలసీని ఎంతగా వడపోసినా.. శ్రమించకుండా.. ఈజీగా మానెటైజేషన్ సంపాదించి.. డబ్బులు సంపాదిస్తున్నవాళ్లకు లెక్కేలేదు. వేరేవాళ్ల కంటెంట్ ను కాపీ చేసి.. కాపీరైట్ ఉన్న కంటెంట్ ను మార్చేసి.. వ్యూస్ సంపాదించి.. డబ్బులు కొల్లగొడుతున్నవాళ్లెందరో. అలాంటివాళ్లను కాకుండా.. జెన్యూన్ క్రియేటర్స్ కు మాత్రమే ఎంకరేజ్ చేసేలా.. యూట్యూబ్ తన రూల్స్ ను మరోసారి మార్చింది. 2020 ఫిబ్రవరిలో వచ్చిన పాలసీ అప్ డేట్ లోని కొత్తవి, ముఖ్యమైనవి తెల్సుకుందాం.

యూట్యూబ్ క్రియేటర్స్ ఈ విషయాలు తెల్సుకోవడం చాలా ఇంపార్టెంట్. తమ కంటెంట్ లో రూల్స్ కు తగ్గట్టుగా మార్పులు చేసుకుని ఎర్న్ చేయాలని కోరుతున్నాం.

యూట్యూబ్ మానెటైజేషన్ పాలసీకి సంబంధించిన రివ్యూలో కీలక మార్పులు చేశారు. వాయిస్ ఓవర్ ను మస్ట్ చేశారు. వెయ్యి మంది సబ్ స్క్రైబర్లు, 4వేల గంటల వాచ్ టైమ్ అనే క్రైటీరియా మారలేదు కానీ.. తర్వాత… మానెటైజేషన్ రివ్యూను మరింత పకడ్బందీగా మార్చింది.

యూట్యూబ్ లో మానెటైజేషన్ క్రైటీరీయా రీచ్ అయినప్పుడు.. కింద రూల్స్ ను రివ్యూలో పరిశీలిస్తుంది యూట్యూబ్ టీమ్.

1.ఛానెల్ మెయిన్ థీమ్.

-ప్రతి ఛానెల్ కు ఓ థీమ్ ఉంటుంది. ఆ థీమ్ లోనే వీడియోస్ పెట్టాలి. మిక్స్ డ్ కంటెంట్ పెట్టకూడదు. ఏ వీడియో పెట్టినా.. ఆ థీమ్ బేస్డ్ గానే ఉండాలి. కుకరీ ఛానెల్ లో ట్రావెలింగ్ వీడియోస్.. టెక్ ఛానెల్ లో.. ఎంటర్ టైన్ మెంట్ కంటెంట్.. ఇలా మిక్స్ చేయకూడదు.

2.మోస్ట్ వ్యూయ్డ్ వీడియోస్

-కొంతమంది మానెటైజేషన్ క్రైటీరియా తొందరగా రీచ్ అయ్యేందుకు పాపులర్ కంటెంట్ ను ఎడిట్ చేసి పెడుతుంటారు. అలా ఇకనుంచి కుదరదు.  రివ్యూ చేసినప్పుడు మోస్ట్ వ్యూయ్డ్ వీడియోస్ థీమ్ ను కచ్చితంగా లెక్కలోకి తీసుకుంటారు. దాన్ని బట్టే మానెటైజేషన్ యాక్సెప్ట్ చేస్తారు.

3.న్యూయెస్ట్ వీడియోస్

-మోస్ట్ వ్యూయ్డ్ వీడియోస్, కొత్తగా అప్ లోడ్ చేసిన వీడియోస్ అన్నింటికీ కంపేర్ చేస్తారు. సో అన్నీ ఛానెల్ థీమ్ కు సంబంధించినవే అయి ఉండాలి.

4.బిగ్గెస్ట్ ప్రోపోర్షన్ ఆఫ్ వాచ్ టైమ్

-ఎంచుకున్న స్ట్రీమ్ కాకుండా.. వాచ్ టైమ్ కోసం, వ్యూస్ కోసం , ట్రెండింగ్ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నారా.. అనేది చెక్ చేస్తారు.

5.వీడియో మెటా డేటా- టైటిల్స్, తంబ్ నెయిల్స్, డిస్క్రిప్షన్స్ కలుపుకుని.

-ప్రతి వీడియో మెటా డేటాను చెక్ చేస్తుంది యూట్యూబ్ చెక్ చేస్తుంది.

6.వీటితోపాటు.. రెగ్యులర్ గా ఉండే  యూట్యూబ్ మానెటైజేషన్ పాలసీని తప్పకుండా పాటించాల్సిందే.

7.ఓల్డ్ వీడియోను వాడితే..  ఇన్ఫర్మేషన్ ను కచ్చితంగా అప్ డేట్ చేసి పెట్టాలి. యూట్యూబ్ ఒరిజినల్ కంటెంట్ కే హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తుంది.

8.ఇంట్రో, ఔట్ రో సేమ్ ఉన్నా ఫర్వాలేదుకానీ.. వీడియోలో మధ్యలో ఉండే మెయిన్ కంటెంట్ ఒరిజినల్ అయ్యుండాలి.

9. ట్విట్టర్, ఫేస్ బుక్, టిక్ టాక్, హలో.. లాంటి అదర్ సోషల్ ప్లాట్ ఫామ్స్ లో ఉండే ఎటువంటి వీడియోలకు.. యూట్యూబ్ లో మానెటైజేషన్ ఉండదు. యూనిక్ కంటెట్ మాత్రమే యూట్యూబ్ లో డబ్బులు తెచ్చిపెడుతుంది. వ్యూస్ కోసం వేరే ప్లాట్ ఫామ్ వీడియోలను అప్ లోడ్ చేసినా..  రివ్యూ టైమ్ లో దొరికిపోతారు.

10.న్యూస్ పేపర్లు, వెబ్ సైట్లలోని వార్తలను వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇస్తే.. దానికి మానిటైజేషన్ ఉండదు.

11.కాపీరైట్ ఉన్న పాటల పిచ్ , స్పీడ్ పెంచడం, స్లో చేయడం.. లాంటివి చేసినా వాటికి మానెటైజేషన్ ఉండదు. ఇదే వీడియోలకు కూడా వర్తిస్తుంది. వీడియోల డైమన్షన్స్ మార్చి.. కలర్ ఫిల్టర్స్ మార్చినా.. కూడా మానెటైజేషన్ ఇవ్వరు.

12. లో-ఎడ్యుకేషన్ వాల్యూస్ ఉన్న మైండ్ లెస్ వీడియోలకు డబ్బులు రావు.

13.  గ్రాఫికల్, ప్రోగ్రామెటికల్లీ జెనరేటెడ్ వీడియోస్, టెంప్లేటెడ్ వీడియోస్ కు పైసలు రావు. అంటే.. కళ్లను కనికట్టుచేసే కొన్ని గ్రాఫికల్ వీడియోస్ ను రిపీటెడ్ గా ప్లేచేస్తుంటారు కొందరు. చూట్టానికి అమేజింగ్ గా అనిపిస్తుంది కానీ.. వాటికి మానెటైజేషన్ రాదు.

14. ఫొటోలకు ఆడియో జతచేసి వీడియోలు తయారుచేసి అప్ లోడ్ చేస్తే డబ్బులు రావు. అంటే.. వాయిస్ ఓవర్ లేని లేదా తక్కువ వాయిస్ ఓవర్ ఉన్న ఇమేజ్ స్లైడ్ షోస్, స్క్రోలింగ్ టెక్ట్స్ వీడియోలు మానెటైజ్ అవ్వవు.

15.కొత్త అప్ డేట్ ఏదైనా వాయిస్ ఓవర్ తో, వీడియోలో కనిపిస్తూ చెప్పేటప్పుడు.. అవసరమనుకుంటే పాత వీడియోలను వాడుకోవచ్చు. యాజిటీజ్ గా పాతవీడియోలు మాత్రం రీ యూజ్ చేయకూడదు.

16.ఎక్కువ ఛానెల్స్ ఒకే కంటెంట్ ను అప్ లోడ్ చేస్తే దానికి మానెటైజేషన్ ఉండదు. ఇది ఇబ్బందికరమైన అంశమే.

*ఇప్పటికే తమ పాలసీకి వ్యతిరేకమైన కంటెంట్ తో వీడియోలు చేస్తే యెల్లో డాలర్స్ ఇస్తుంది యూట్యూబ్. వీటిని రిక్వెస్ట్ బేస్డ్ గా.. గ్రీన్ డాలర్ గా మార్చుకునే వీలుంది. రిక్వెస్టులు పెట్టుకోమని యూట్యూబ్ మరోసారి కోరింది.

కరోనా వైరస్ పై చేసిన వీడియోస్ మానెటైజేషన్ ఉండదు. రిక్వెస్ట్ పెట్టినా ఇవ్వరు.

వైటీ స్టూడియో యాప్ ను అప్ గ్రేడ్ చేశారు. అనలిటిక్స్ డేటాను మరింతగా విశ్లేషించి తెల్సుకునే వీలు కల్పించారు.

 

(Visited 349 times, 1 visits today)
Author: kekanews