రేప్ చేయబోయారు..! బంజారాహిల్స్ పోలీసులపై యువజంట సంచలన ఆరోపణలు

Couple Sensational Rape Allegations on Banjarahills police
Spread the love

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులపై అత్యాచార ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తమపై స్టేషన్ లో అత్యాచారానికి, దాడికి పాల్పడ్డారంటూ ఓ యువజంట ఫేస్ బుక్ లో వీడియోలో వివరించింది. ఆ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది. అందులో.. బాధితురాలు, ఆమె భర్త సురేష్ చెప్పిన మాటలు యథాతథంగా.

బాధితురాలు వీడియోలో మాట్లాడుతూ..”బంజారాహిల్స్ పీఎస్ లో సీఐ కళింగరావు, ఎస్సై రాంబాబు, డీఐ రవికుమార్, ఎస్సై వీడినాయుడు, ఎస్సై రామిరెడ్డి వీళ్లంతా అత్యాచార యత్నం చేశారు. డిసెంబర్ 3న ఓ పిటిషన్ ఇవ్వడానికి వెళ్లాను. ఆ టైమ్ లో ఓ ఇన్ స్పెక్టర్ నన్ను ఓ ప్రాస్టిట్యూట్ రాసిచ్చినట్టు రాసింది అంటూ తిట్టాడు. సీపీకి కాల్ చేస్తే..  తన ఆఫీస్ కు రావాలని.. వారిపై యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. ఐతే.. అంతలోనే ఏసీపీ మాకు ఫోన్ చేసి పైఆఫీస్ వరకు వెళ్లొద్దు…. మేం సెటిల్ చేస్తాం..  స్టేషన్ కు వెళ్లండి.. కంప్లయింట్ తీసుకుంటారని చెబితే ఆగిపోయాం. ఇదే విషయంలో డిసెంబర్ 8న మళ్లీ మేం స్టేషన్ కు వెళ్లినప్పుడు నన్ను సెక్సువల్ గా అబ్యూజ్ చేశారు. నా భర్తను కొట్టారు. ఇది చాలా దారుణం. పోలీసులు ఇలాక్కూడా ఉంటారా. మాకు రక్షణ లేదు” అని చెప్పారు బాధితురాలు.

ఆ తర్వాత జరిగిన సంగతిని భర్త సురేష్ వివరించాడు. ఆయనేమన్నారో.. ఆయన మాటల్లోనే.

“మేం పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే ప్రాస్టిట్యూట్ అని తిట్టారనడానికి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. దాన్ని కవర్ చేసుకునేందుకు.. మమ్నల్ని అకారణంగా స్టేషన్ లో ఉంచారు. డిసెంబర్ 8నాడు రాత్రి స్టేషన్ లోనన్ను రబ్బర్ బెల్ట్ తో , లాఠీతో కొట్టారు. ఎస్సై రాంబాబు, ఎస్సై రామిరెడ్డి. ఎస్సై వీడీ నాయుడు సాయంత్రం 6.40కి మమ్మల్ని పైకి తీసుకెళ్లి 4 గంటల పాటు  సీసీ కెమెరాలు లేని రూమ్ లో ఉంచి దాడిచేశారు. ఆరోజు మ్యాచ్ వస్తోంది. ట్యాబ్ లో మ్యాచ్ చూస్తూ.. బౌండరీ మిస్సయినప్పుడల్లా… వాన్నొకటి పీకు.. దాన్నొకటి తన్ను అంటూ.. ఎస్సై రవికుమార్ హెరాస్ చేశారు. మేం ఇంతదారుణమైన పరిస్థితులు ఎన్నడూ ఫేస్ చేయలేదు. ఎస్సై రామిరెడ్డి రాత్రిపూట వచ్చి.. నా మీదనుంచి.. నా మిసెస్ మీదనుంచి అటూ ఇటూ జంప్ చేస్తూ… పరాచకాలు ఆడాడు. తనకు కోరిక కలగవచ్చంటూ సీఐ ఘోరంగా మాట్లాడి.. రాత్రిపూట నా భార్యను ఉమెన్ పీఎస్ – సీసీఎస్ కు పంపించాడు. రాత్రి నన్ను లాకప్ లో పెట్టారు. మర్నాడు మెజిస్ట్రేట్ ముందుకు తీసుకుపోయి.. డైరెక్ట్ చంచల్ గూడ జైలుకు పంపించారు. ఏ కేసు మాపై నమోదు చేశారో తెలియదు. ఆ మర్నాడు కోర్టులో డిఫెండ్ చేయడానికి పోలీసులు, పీపీ రాకపోవడంతో.. దేవుడి దయతో మాకు బెయిల్ వచ్చింది” అని చెప్పారు.

కారణం తెలిస్తే షాక్

డిసెంబర్ 9వ తేదీన 2009 బ్యాచ్ సీఐలకు ప్రమోషన్లు ఇచ్చారట. అదేరోజు సీపీకి కంప్లయింట్స్ వెళ్తే తమకు ప్రమోషన్స్ రావని .. అందుకే పోలీసులు అలా చేశారట. ఈ విషయం ఎస్సై వీడీ నాయుడు తమకు చెప్పినట్టుగా బాధితులు వీడియోలో చెప్పారు. పోలీసులు తమపై కఠినంగా ప్రవర్తించి, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని చెప్పారు.

బంజారాహిల్స్ లాంటి పీఎస్ లో .. ఓ మహిళపై సెక్సువల్ అబ్యూజ్ చేశారంటే.. ఇంతకంటే దారుణం ఉండదని ఆ కపుల్ అన్నారు. తమకు స్టేషన్ లోని పోలీసుల వల్ల బయట రక్షణ లేదని.. అందుకే.. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా దృష్టికి సమస్య తీసుకొస్తున్నామని చెప్పారు.

కపుల్ ఆరోపణలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో కిందచూడొచ్చు.

https://youtu.be/eYld0uf1J3c

(Visited 86 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *