టీవీ చర్చల్లో మహిళలపై వివక్ష ఎందుకు?

Spread the love

మానెల్స్
కేవలం పురుషులు మాత్రమే ప్రసంగించే వేదికలు. అది జర్నలిజం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఎకానమీ కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఒక్కోసారి విమెన్ ఎంపవర్మెంట్ కూడా కావచ్చు వేదికమీద ఉండే వాళ్ళంతా పురుషులే అయిఉంటారు. అది రియా చక్రవర్తిమీద దాడి అయినా, రాజకీయాల్లో ప్రియాంక గాంధీ గురించి అయినా పురుషులకు మాత్రమే అభిప్రాయాలు ఉంటాయి. విచిత్రం ఏమిటంటే చాలాసార్లు ఆ వేదికల మీద ఉండే పురుషులు చాలామంది inclusivity మీద, gender equality మీద గట్టి నమ్మకం ఉన్న వాళ్ళయి ఉంటారు. అలాంటి manel లో ఎందుకు ఉన్నారు అనడిగితే వక్తలు మా చాయిస్ కాదుకదా అని తప్పించుకుంటారు. కాని నిజానికి ఎవరిని ఏ వేదిక మీద మాట్లాడటానికి పిలిచినా అందరూ తప్పనిసరిగా మిగిలిన వక్తలు ఎవరని అడుగుతారు. కాబట్టి అది మానెలా కాదా అన్నది ఒప్పుకునే ముందే ఖచ్చితంగా తెలుస్తుంది. Gender diversity లేని పానెల్ లో నేను ఉండను అని తిరస్కరించిన పురుష మేధావులెవరూ ఇంతవరకూ నాకు కనిపించలేదు. తిరస్కరించటం అనే పెద్దపని కూడా ఎందుకు, ఏంటి ఈ మానెల్ అని కూడా అడుగరు. ఆర్గనైజర్స్ కూడా ఇలాంటి వాళ్ళతోనే నిండి ఉంటాయి. అనేక లెఫ్ట్ సంస్థల్లోనూ ఇదే పరిస్థితి. మా జర్నలిస్టు సంఘాలు అన్నిటికంటే వరస్ట్. అన్నట్లు టీవీ చానెల్స్ కూడా. NWMI చేసిన ఒక అధ్యయనం లో టీవీ చానళ్ళు నడిపే చర్చల్లో పురుషులశాతం 86 అయితే కేవలం 14 శాతం స్త్రీలు 0.2 శాతం ట్రాన్స్ జండర్ ఉన్నారని తేలింది.
అన్నట్లు మహిళా దినోత్సవం రోజు మాత్రo వేదిక మొత్తం స్త్రీలదే. అప్పుడు మైక్ సెట్టు వాళ్ళు మినహా హాలులో పురుషులెవరూ ఉండరు కదా ఎలాగూ! లింగసమానత్వం అనేది స్త్రీలు ఒక్కళ్ళే ప్రయత్నించి సాధించాలి మరి. మిగిలిన అన్ని విషయాల్లోనూ పురుషుల మాటే ఫైనల్.

కాబట్టి సమానత్వాల గురించి నమ్మే మేధావులారా ఊరికే సోది కబుర్లు చెప్పకండి. ఈసారి ఏదైనా మానెల్ లో ఉండమని కోరితే తిరస్కరించండి. Walk the talk dood.

P.s. అన్నట్లు దేశానికో, సమాజానికో సంబంధించిన అంశంమీద ఏదైనా మానెల్ మాట్లాడుతున్నప్పుడు మనం ఈ విషయం పాయింట్ అవుట్ చేస్తే అటు ఆర్గనైజర్స్ ఇటు వక్తలు భలే అప్సెట్ అయిపోతారు మనం ముఖ్యమైన విషయం పక్కదారి పట్టిస్తున్నామని. అనుభవంతో చెప్తున్నా చాలామంది పెద్దపెద్ద వాళ్ళు కూడా దీనికి మినహాయింపు కాదు.
#Manels

Credit: Vanaja C

(Visited 130 times, 1 visits today)
Author: kekanews