నార్తీస్ట్ రాష్ట్రాలు CABను ఎందుకు వద్దంటున్నాయి…?

Citizenship Amendment Act AmitShah Kekanews
Spread the love

నార్తీస్ట్ రాష్ట్రాల్లో ట్రైబల్స్ డామినేషన్ ఎక్కువ. వేరే రాష్ట్రంనుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ల ఉద్యోగ అవకాశాలు, వాళ్ల కల్చర్, వాళ్ల సహజ మూలాలు, స్థానికత దెబ్బతింటుందన్న భయం నార్తీస్ట్ లోని ప్రతి వ్యక్తికి ఉంది.

ఈ భయంలోనే అస్సాం కూడా ఉంది. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ స్టార్టైనప్పుడు.. చాలామంది బెంగాళీ హిందూస్.. అస్సాం, వెస్ట్ బెంగాల్ కు వచ్చారు. వీళ్లందరికి CitizenShip Amendment Billతో భారత పౌరసత్వం దక్కింతే… తమ అవకాశాలు ఎక్కడ తగ్గుతాయో.. తమ ఆర్థిక అవకాశాలు ఎక్కడ తగ్గిపోతాయో అన్న భయంతో.. అస్సాంలో ఇండియాలోని బెంగాళీలపై కూడా దాడులు జరిగాయి. అందుకే.. 1985లో ఓ చట్టం చేశారు. 1971కు ముందు వచ్చినవాళ్లు మాత్రమే పౌరులనీ.. మిగతావాళ్లు శరణార్థులని చట్టం చేశారు. ఇపుడు ఆ లైన్ ను 2014కు మార్చింది కేంద్రప్రభుత్వం. ఇక్కడే సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

1971 నుంచి.. 2014 మధ్యలో ఎవరైనా బంగ్లాదేశ్ నుంచి మతపరమైన హింస పేరుతో ప్రాణభయంతో ఇండియాకు వస్తే వాళ్లకు కూడా సిటిజన్ షిప్ ఇచ్చే ఆస్కారం ఉందని అని #CAB చట్టం చెబుతోంది. ఈ ప్రతిపాదన అస్సాం ప్రజలకు నచ్చలేదు. వాళ్ల ఐడెంటింటీ పోతుంది.. జాబ్స్ ను వీళ్లు షేర్ చేసుకుంటారని భయం వాళ్లది.

రాజస్తాన్ లాంటి పెద్ద రాష్ట్రంలో పాక్ నుంచి హిందువులు వచ్చి శరణార్థులుగా, పౌరులుగా ఉంటున్నారు. అక్కడ పాపులేషన్, అవకాశాలు ఎక్కువ కావడంతో సమస్య రాలేదు. ఈశాన్య రాష్ట్రాలు చిన్నవి, ట్రైబల్స్ కావడంతో.. వాళ్ల అవకాశాలు ఎక్కడ దెబ్బతింటాయో అన్నది వారి భయం. అందుకే.. వారి భయాన్ని పోగొట్టేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది. శరణార్థులు, వలస వచ్చినవాళ్లు చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉండకుండా.. వెస్ట్ బెంగాల్, మధ్య ప్రదేశ్, బిహార్, యూపీలాంటి వేరే రాష్ట్రాల్లోకి వెళ్తారని చెబుతోంది. ఈ విషయం స్ర్పెడ్ అయినప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు తగ్గుముఖం పట్టే చాన్సుంది. సాటి మనిషికి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసమే డెడ్ లైన్ ను 1971 నుంచి 2014కు తెచ్చామనీ.. దీంతో.. స్థానికుల ప్రయోజనాలు దెబ్బతినవని కేంద్రం అర్థమయ్యేలా చెప్పినప్పుడే అక్కడ ఆందోళనలు తగ్గుతాయి.

CAB ఆరో షెడ్యూల్ అంటే ఏంటి..?

నార్తీస్ట్ రాష్ట్రాల్లో ట్రైబల్స్ హక్కులు, కల్చర్ రక్షణ కోసం కొన్ని ప్రాంతాలను ఆరో షెడ్యూల్ లో ఉంచారు. వాటి పరిరక్షణ గవర్నర్ సంరక్షిస్తారు. హిందూ, ముస్లిం ఎవరైనా సరే.. సిక్త్స్ షెడ్యూల్ ఉన్న ఏరియాస్ లో సిటిజన్ షిప్ నిబంధనలు పూర్తిచేసినా.. అక్కడ సెటిల్ అయినా కూడా… వారికి పౌరసత్వం రాదు. అస్సాం, మేఘాలయ, త్రిపుర స్టేట్స్ లో ట్రైబల్స్ డామినేట్ చేసే ఏరియాస్ కొన్ని సిక్స్త్ షెడ్యూల్ లో ఉన్నాయి.

CAB ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే..?

1873లో బ్రిటీష్ గవర్నమెంట్ ఓ రెగ్యులేషన్  పాస్ చేసింది. టీ ప్లాంటేషన్,కమర్షియల్ టింబర్ ప్లాంటేషన్ జరిగే ప్రాంతాల్లోకి మామూలు జనాలు వెళ్లకూడదు అని బ్రిటీష్ వాళ్లు ఓ రూల్ చేశారు. అక్కడికి వెళ్లాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అదే ఇన్నర్ లైన్ పర్మిట్. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాలకు ఇన్నర్ లైన్ పర్మిట్ ఉంది. ఇండియన్ సిటిజన్స్ ఐనా కూడా.. ఈ పర్మిట్ తీసుకోవాల్సిందే. బ్రిటీష్ వాళ్లు కమర్షియల్ ఎక్స్ ప్లాయిటేషన్ కోసం వాడితే.. ఇండిపెండెంట్ ఇండియా.. ట్రైబల్స్ యూనిక్ ఐడెంటిటీ, ట్రైబల్ కల్చర్ ను కాపాడేందుకు ఈ పర్మిట్ ను అమలుచేస్తోంది.

NRC అమలైతే.. వెస్ట్ బెంగాల్ లో జనాభా పరంగా విడిపోతుందా..?

వెస్ట్ బెంగాల్ లో ను ఇల్లీగల్ మైగ్రెంట్స్ తో ఇబ్బందులు వస్తున్నాయి. ఎన్నార్సీని వెస్ట్ బెంగాల్ రాష్ట్రమే ఫస్ట్ వద్దని చెప్పింది. తృణమూల్ కాంగ్రెస్ కు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఓట్లే ఎక్కువ. ఇదే మమతా బెనర్జీ గతంలో ఎన్నార్సీ కావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది. 2013లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోనే బీజేపీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తోంది. బీజేపీ కొత్తగా తెచ్చిందేం లేదు. ఎన్నార్సీ అమలు  కాకపోతే.. పార్లమెంట్ లో, అసెంబ్లీలో ఎవరు ఉండాలనేది ఇండియన్స్ డిసైడ్ చేసే పరిస్థితి ఉండదని కేంద్రం చెబుతోంది. పక్కదేశాలే డిసైడ్ చేస్తాయంటోంది. ఇక్కడ ఓ మతాన్ని తక్కువ చేయడంలేదు. కొన్నిమతాలను కాపాడుతున్నారు. మైనారిటీలకు కొన్ని రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. అంటే హిందువులను దెబ్బతీయాలన్నట్టు కాదు. ఎన్నార్సీ యాంటీ ఇస్లామ్ ఐతే… భారత రాజ్యాంగం యాంటీ హిందూ అని ఒప్పుకోవాలి. అలాంటప్పుడే ఏ రాష్ట్రమైనా బిల్లును రద్దుచేయాలి.

(Visited 124 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *