అసలు చిరంజీవి,రాజశేఖర్ ఎందుకు గొడవపడ్డారో తెలుసా..?

Chiranjeevi Rajashekhar
Spread the love

హైదరాబాద్ బేగంపేటలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డెయిరీ లాంచ్ ఈవెంట్ రచ్చరచ్చ అయింది. మా ప్రెసిడెంట్ నరేష్, జనరల్ సెక్రటరీ జీవిత ప్యానెల్స్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. సీనియర్ నరేష్ వర్గం, రాజశేఖర్ వర్గానికి మధ్య కొన్ని నెలలుగా పడటం లేదు. ఎన్నికలప్పటినుంచి ఉన్న విభేదాలు.. ఇపుడు మరింత రచ్చగా మారాయి.

చిరంజీవి మాట్లాడుతుండగా… మధ్యలో కలగజేసుకునేందుకు మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయిన రాజశేఖర్ ట్రై  చేశారు. ఐతే.. చిరంజీవి మాట్లాడటం అయిపోయాకే.. మాట్లాడేందుకు ట్రై చేశారు రాజశేఖర్. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా.. రాజశేఖర్ మైక్ తీసుకున్నారు. కూర్చున్న పెద్దల కాళ్లు మొక్కుతూ… మాలో ప్యానెళ్ల మధ్య విభేదాలు.. పరిష్కారం కాని సమస్యల గురించి మాట్లాడటంతో మీటింగ్ లో వేడి పెరిగింది.

రాజశేఖర్ ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతుంటారు. ఆయన తప్పైనా ఒప్పైనా చెప్పి పక్కకు జరుగుతుంటారు. ఆయనకు ఎమోషన్స్ కూడా ఎక్కువే. అలాంటి చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న రాజశేఖర్.. తాను మా పదవిలోకి వచ్చాక.. అంతే అగ్రెసివ్ గా సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. ఈ పరిణామాలతో ఘర్షణ వల్లే ఇవాళ  ఔట్ బరస్ట్ అయ్యారు. గొడవలు, విభేదాలు ఉన్నమాట వాస్తవమే అన్ని చిరంజీవి ఒప్పుకున్నాక… మళ్లీరాజశేఖర్ మాట్లాడటం అనవసరం. ఒకవేళ చెప్పాలనుకుంటే ఇష్యూ రెయిజ్ చేసి వదిలేసి ఉంటే ఓ పనైపోయేది. ఐతే.. అంతటితో వదిలేస్తే.. ఆయన రాజశేఖర్ ఎలా అవుతారు. సినిమాల్లో,రాజకీయాల్లో ఇలా.. పలు రకాలుగా చిరంజీవితో దెబ్బలు తిన్నానన్న భావనతో ఉన్న రాజశేఖర్.. మీటింగ్ సాక్షిగా ప్రశ్నించేయాలనుకున్నారు. అదే ప్లాన్ ను అమలుచేశారు. నిరసనతో చేసి మీటింగ్ ను రచ్చచేశారు రాజశేఖర్. ఇంటెన్షనల్ గానే మీటింగ్ వచ్చినట్టు కనిపించారు.

చిరంజీవిగురించి.. మా పెద్దల గురించి రాజశేఖర్ కాస్త వెటకారంగా మాట్లాడాడు. మా అసోసియేషన్ పెద్దలు విభేదాలు తొలగించే ప్రయత్నం చేయాలని, పరిష్కారం కాని సమస్యలపై ఫోకస్ చేయడం లేదని రాజశేఖర్ అన్నాడు. మాలో విభేదాలే తన యాక్సిడెంట్ కు కూడా కారణమన్నాడు.

రాజశేఖర్ మాట్లాడి వెళ్లిపోతుండగా చిరంజీవి కలగజేసుకుని.. మంచి మ్యాటర్ ఏదైనా ఉంటే మైక్ లో చెప్పాలని.. చెడును చెవిలో చెప్పాలని అన్నాడు. అప్పుడు రాజశేఖర్ మళ్లీ మైక్ అందుకున్నాజు. “నిప్పును కప్పి పుచ్చితే పొగ రాకుండా ఉండదు. సినిమాల్లో హీరోలుగా మనం నటిస్తున్నాం.. కానీ.. రియల్ లైఫ్ లో మనం సమస్యలను నొక్కేస్తున్నాం.. తొక్కేస్తున్నాం” అన్నారు. అసోసియేషన్ లో 26 మందిలో 18 మంది ఓ వైపు ఉన్నారని అన్నారు. గత అసోసియేషన్ లో విభేదాలు ఉండేవి కావని అన్నారు.

మంచి ఉంటే చెవిలో చెప్పమని తాను చెప్పిన మాటకు రాజశేఖర్ విలువ ఇవ్వలేదని.. గౌరవం ఇవ్వలేని వాళ్లు ఇక్కడ ఎందుకు ఉండాలి అని చిరంజీవి కాస్త ఘాటుగానే అన్నారు. మైక్ లాక్కోవడం ఏమాత్రం కరెక్టా… సౌమ్యంగా మాట్లాడ దల్చుకున్నాననీ.. తనతో కూడా కోపంగా మాట్లాడేలా చేశాడని అన్నారు. రాజశేఖర్ పై క్రమశిక్షణ చర్యలకు చిరంజీవి సూచన చేశారు. తర్వాత… మాట్లాడిన జీవిత… రాజశేఖర్ ది చిన్నపిల్లాడి మనస్తత్వమనీ.. మనసులో ఏదుంటే అదే మాట్లాడతారని అన్నారు. జరిగిన సంఘటనకు అందరికీ క్షమాపణ చెబుతున్నట్టు జీవిత చెప్పారు. మాలో విభేదాలున్నది నిజమే అనీ.. అని స్టేజీపై జీవిత అంటే.. ఆమె ఆరోపణలు తప్పుపట్టారు నరేష్.

(Visited 108 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *