పాక్, ఆప్ఘన్ అహ్మదీస్ కు CAB ఎందుకు పౌరసత్వం ఇవ్వదు..?

Citizenship Amendment Act AmitShah Kekanews
Spread the love

దేశ విభజనలో అహ్మదీయాస్ ది చాలా ఇంపార్టెంట్ రోల్. వాళ్లు దేశ విభజనలో పాకిస్థాన్ ను సపోర్ట్ చేశారు. వాళ్లు పాకిస్థాన్ కు వలసవెళ్లారు. అహమ్మదీయ మూవ్ మెంట్ హెడ్ క్వార్టర్స్ మన పంజాబ్ అమృత్ సర్ లో ఉంటే.. పార్టిషన్ తర్వాత… పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోకి షిఫ్ట్ చేసుకున్నారు. అహ్మదీస్ పాక్ లోనే ఉండేందుకు ఇష్టపడ్డారు. పాక్ లో మతపరంగా సెక్టేరియన్ ఎక్కువైపోయి.. సున్నీలు, షియాలు, అహ్మదీస్ వాళ్లు వాళ్లు కొట్టుకుంటున్నారు. కొట్టుకున్నవాళ్లంతా మనదేశంలోకి వస్తామంటే కష్టమని చట్టం చెబుతోంది. ముస్లింస్, అహ్మదీస్ కొట్టుకుంటున్నారనీ… అహ్మదీస్ ను రానివ్వడం.. సున్నీలు, షియాలు కొట్టుకుంటున్నారనీ షియాలను రానిచ్చి.. ఆ తర్వాత వహాబీలను కూడ రానిస్తే… దానికి ఎండ్ ఉండదు. ఓ అర్థం ఉండదు. అహ్మదీస్ పేరుతో.. ఐఎస్ఐఎస్, లష్కరే తాయిబా రాదనే గ్యారంటీలేదు. వెళ్లేటప్పుడే అహ్మదీయాస్ డిసైడైపోయి వెళ్లిపోయారు.

మనదేశంలోనే ముస్లింలు సేఫ్ అండ్ హ్యాపీ

మనదేశం సెక్యులర్ కంట్రీ కాబట్టి.. షియాలు, సున్నీలు హ్యాపీగా కలిసే ఉంటున్నారు. పాక్ తాను సెక్యులర్ అని చెప్పుకోక… ఇస్లాం అని చెప్పుకుని.. అంతర్గత వర్గాలతో కొట్టుకుంటే.. అది మన ప్రాబ్లమా అని కేంద్రం చెబుతోంది. పాక్ లో తమ మతానికి చెందిన ఎవరినైనా కాపాడుకునే బాధ్యత అక్కడి ప్రభుత్వానిదే. షియా ఐనా.. సున్నీ ఐనా.. అహ్మదీ ఐనా.. వహాబీ ఐనా.

(Visited 84 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *