ఆర్నాబ్ TimesNow నుంచి ఎందుకు బయటకు వచ్చాడంటే..?

why arnab goswami left times now
Spread the love

ఆర్నాబ్ గో స్వామి.. TIMES NOW.. ఈ రెండు విడదీయరాని పేర్లనుకున్నారు. కానీ విడిపోయాయి. టైమ్స్ నౌ నుండి ఆర్నబ్ నాలుగేళ్ల కిందటే బయటికి వచ్చాడు. అవమానాన్ని సవాల్ గా తీసుకుని.. తాను అనుకున్న లక్ష్యం దిశగా సాగుతున్నాడు కాబట్టే.. ఓసారి నాలుగేళ్ల ప్రస్థానాన్ని చర్చిద్దా.

ఆర్నబ్.. తను సొంతంగా ఎందుకు Republic చానెల్ పెట్టుకున్నాడు ? 2016 లో ఇవన్నీ మన కళ్ల ముందే జరిగాయి కానీ ఎక్కడా దీనికి కారణమెంటో ఎవరో చెప్పలేదు. ఏదో గొడవలు వచ్చి వుంటాయి అనుకున్నారు కానీ అసలు ఆ గొడవ ఏంటో ఎవరికీ తెలీదు. ఇలా ఒక చానెల్ నుండి ఇంకో చానెల్ కి మారడం మనం తరుచూ చూస్తూనే ఉంటాము. కానీ ఒక న్యూస్ చానెల్ లో పనిచేసి బయటికి వచ్చి సొంతంగా న్యూస్ చానెల్ పెట్టుకొని అప్పటివరకూ తను పనిచేసిన న్యూస్ చానల్ No.1 స్థానంలో ఉండడానికి తానే కారకుడు అలాగే తను బయటికి వచ్చి సొంతంగా చానెల్ పెట్టి ఇంతకు ముందు తను పనిచేసిన TIMES NOW చానెల్ కి ఉన్న No.1 స్థానాన్ని కిందకి నెట్టి  Republic Tv ని ఆ స్థానంలోకి తీసుకురావడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ని స్వీకరించి దానిని సక్సెస్ చేయడం అనేది ఆర్నాబ్ కె చెల్లింది.

ఆర్నాబ్ ఫ్యామిలీ గురించి..

ఆర్నాబ్ గోస్వామి మార్చ్ 7,1973 లో అస్సాం లోని గువాహతీ లో జన్మించాడు. తండ్రి మనోరంజన్ గోస్వామి ఆర్మీ లో 30 ఏళ్ళు పని చేసి కల్నల్ గా చేసి రిటైర్ అయ్యారు. మనోరంజన్ గోస్వామి ఆర్మీ లో ఆఫీసర్ గా పనిచేసినా మంచి రచయిత. పత్రికలకీ కాలమ్స్ వ్రాసేవారు అలాగే చాలా పుస్తకాలు వ్రాసారు. మనోరంజన్ గోస్వామి అస్సాం సాహిత్య సభ అవార్డ్ ఇచ్చింది తన రచనలకి.  తల్లి  సుప్రభా జైన్ గోస్వామి ప్రసిద్ధ రచయిత్రి.

ఆర్నాబ్ కెరీర్ ఆరంభం

ఆర్నాబ్ తన జర్నలిజం కెరీర్ ని కలకత్తా లోని The Telegraph తో మొదలుపెట్టారు. అక్కడ ఒక సంవత్సరం పనిచేశాక 1996 లో NDTV లో న్యూస్ రీడర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. NDTV లో News Tonight అనే ప్రోగ్రామ్ చాలా ఫేమస్ అయ్యింది అప్పట్లో [DD Metro ] బెస్ట్ ఆసియా న్యూస్ యాంకర్ గా 2004 లో అవార్డ్ దక్కింది.1996 నుండి 2006 వరకు NDTV లో పనిచేశారు. తరువాత 2006 లో కొత్తగా లాచ్ చేసిన  TIMES NOW లో ఎడిటర్ -in -చీఫ్ గా జాయిన్ అయ్యారు.

టైమ్స్ నౌను ఎందుకు వీడాడు..

TIMES NOW రాత్రి 9 గంటలకి ప్రసారం అయ్యే NEWS HOUR ప్రోగ్రామ్ చాలా ఫేమస్ అయ్యింది. న్యూస్ అవర్ ప్రోగ్రామ్ live టేలీకాస్ట్ లో చాలా మంది ప్రముఖులని ఆహ్వానించేవారు. చర్చలు చాలా ఉద్వేగపూరితంగా,సూటిగా ఉండేవి. చర్చ పక్కదారి పట్టినప్పుడల్లా ఆర్నాబ్ తీవ్ర స్వరంతో తన ప్రశ్నని పదే పదే అడిగేవాడు. అప్పట్లో అది అందరికీ నచ్చింది కానీ అవే ప్రశ్నలు అంతే తీవ్రస్వరంతో అందరినీ అడగడం మొదలుపెట్టేసరికి కొందరికి కోపం వచ్చింది , అహం దెబ్బతిన్నది. ఫలితంగా ఆర్నాబ్ తన 10 ఏళ్ల TIMES NOW కెరీర్ ని వదులుకోవాల్సి వచ్చింది. బయటికి చెప్తున్న కారణాలు వేరు అంతర్గతంగా న్యూస్ రూమ్ రాజకీయాలు వేరు. యే మీడియా హౌస్ లలో అయినా న్యూస్ రూమ్ పాలిటిక్స్ ఉంటాయి. ఏ వార్తని హైలైట్ చేయాలి ? ఏ వార్తని తీవ్రత తగ్గించి చెప్పాలి ? ఇలా ఉంటాయి ప్రాధాన్యతలు. అఫ్కోర్స్ మీడియా హౌస్ బాస్ కి ఏదో ఒక రాజకీయ పార్టీతో సత్ [?] సంబంధాలు తద్వారా మొహమాటాలు,ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయి బదులుగా వాళ్ళకి సంబంధించిన వార్తలని అసలు కవర్ చేయకపోవడమో లేదా చివరలో ఓ రెండు ముక్కలు ప్రస్తావించడమో జరుగుతుంటాయి. ఇవన్నీ మనకి తెలిసినవే. కానీ అర్నాబ్ అలాంటి మొహమాటాలకి పోయే వాడు కాదు. తను చెప్పదలుచుకున్న వార్తని దాని ప్రాముఖ్యతని పట్టి తీవ్రంగా స్పందిస్తాడు అలాగే సూటిగా ప్రశ్నలు వేస్తాడు. ఇంతకీ TIMES NOW నుండి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది ? ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హత్య కేసు.. దానికి డ్రగ్స్ లింకులు బయటపడడం అది కాస్తా బాలీవుడ్ ని షేక్ చేయడం అన్నిటికీ ఒక దానికి ఒకటి లింక్ ఉంది.

ఖాన్ త్రయానికి చిర్రెత్తించిన ఆర్నాబ్

2016 లో కాశ్మీర్ సరిహద్దు పట్టణం అయిన ‘యూరీ ‘ లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ దాడిలో చనిపోయిన భారత జవానుల సంగతి తెలిసిందే. అలాగే ఇదే సమయంలో ‘అయ్ దిల్ ముష్కిల్ ‘ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఇందులో ప్రధాన పాత్ర పోషించిన పాకిస్తాన్ నటుడు ఫహద్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్ , షారూఖ్ ఖాన్ కానీ ఉగ్రవాద దాడులమీద ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. దీనినే అర్నాబ్ తన ‘NATION WANTS TO KNOW ‘ ప్రోగ్రామ్ లో నేరుగా షారూఖ్, అమీర్, సల్మాన్ లని ప్రశ్నించాడు సూటిగా. ఇది ఖాన్ త్రయానికి నచ్చలేదు. వెంటనే కరణ్ జోహార్ దగ్గరికి వెళ్ళి ఒక జర్నలిస్ట్ మనల్ని ప్రశ్నించడం ఏమిటీ అని నిలదీసారు. కరణ్ తన మిత్రుడు సహ నిర్మాత వినీత్ కుమార్ జైన్ ని నేరుగా ప్రశ్నించాడు.

కరణ్ జోహార్… వినీత్ జైన్.. ఆర్నాబ్.. ఏం జరిగింది..?

వినీత్ కుమార్ జైన్ TIMES NOW కి బాస్. తను కూడా జర్నలిస్టే కానీ NDTV లో పనిచేస్తున్న అర్నాబ్ లోని స్పార్క్ ని చూసి మొదట ఒక చిన్న స్టూడియోలో TIMES NOW చానెల్ మొదలుపెట్టాడు 2006 లో. అర్నాబ్ ప్రతిభ వల్ల అంచెలంచెలుగా ఎదిగిన ఛానెల్ తరువాతి కాలంలో No.1 గా అవతరించింది. అయితే టైమ్స్ నౌ ని అర్నాబ్ చూసుకుంటూ ఉండడం అది బాగా పనిచేస్తుండడంతో  వినీత్ కుమార్ జైన్ సినిమా రంగం వైపు అడుగులు వేశాడు. కరణ్ జోహార్ కి ప్రాణ స్నేహితుడు [ఎలా అని అడగవద్దు ] వినీత్ కుమార్ జైన్… కరణ్ తో కలిసి సహ నిర్మాతగా RAAZI అనే సినిమా తీశాడు కూడా. So! తన ప్రాణ స్నేహితుడుకి కానుకగా ఆర్నాబ్ ని TIMES NOW నుండి అవమానకరంగా తీసేశాడు వినీత్ కుమార్ జైన్. ఉదయాన్నే తన స్టూడియో లోకి అడుగుపెడుతున్న సమయంలో సెక్యూరిటీ గార్డ్ ఆర్నాబ్ ని ఆపేశాడు ప్రవేశం లేదంటూ. విషయం అర్ధం చేసుకున్న ఆర్నాబ్ వెనక్కి వెళ్లిపోయాడు.

తన పార్టీలలో డ్రగ్స్ సరఫరా చేస్తూ కొందరిని మంచి చేసుకుని బతికే ఒక సినిమా డైరెక్టర్.. ఒక నెంబర్ చానెల్1  తో పాటు నెంబర్ వన్ జర్నలిస్టుని ప్రభావితం చేయడం ఆర్నాబ్ కి అస్సలు నచ్చలేదు అసలు తన విధానం ఏమిటంటే ‘ఆర్నాబ్ కి తెలుసు ఎవరూ చెప్పనవసరం లేదు ‘  అని. డ్రగ్స్ అనేది అటు రాజకీయాలని, ఇటు దేశంలోని అన్నీ చిత్ర పర్రిశ్రమలని తన గుప్పిట్లో పెట్టుకొని సినీ హత్యలు.. అది కూడా దావూద్ గ్యాంగ్.. ఒక ప్రముఖ నటుడు సుశాంత్ ని అతని మేనేజర్ ని హత్య చేయించి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడం అనేది తీవ్రమయిన విషయమే. అందుకే ఆత్మహత్యగా మొదట చిత్రీకరించిన దానిని తన వరుస ఇంటర్వ్యూలతో వెలుగులో ఉంచడం వలనే అది హత్య అనీ , డ్రగ్స్ వ్యవహారం ఉందనీ ప్రపంచానికి తెలియచేసాడు ఆర్నాబ్.

Yes ! దమ్ము,ధైర్యం ,నిజాయితీ ఉన్న నిఖార్సయిన జర్నలిస్ట్ తను. తన తండ్రి పనిచేసిన సైన్యం అంటే విపరీతమయిన గౌరవం. అదే తనని తిరిగి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది. తను సొంతంగా పెట్టిన రిపబ్లిక్ చానెల్ ఇప్పుడు దేశంలో No.1 స్థానంలో ఉంది. తను ఓవర్ గా యాక్ట్ చేశాడు అని విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే డ్రగ్స్, హత్యా రాజకీయాలు, హవాలా ద్వారా దావూద్ డబ్బు బాలీవుడ్ లో ఎలా రాజ్యమెలుతుందో దేశానికి తెలియచెప్పాడు. IPL నెపంతో అందరూ కట్ట కట్టుకొని దుబాయ్ కి వెళ్ళిపోయారు అంటేనే తెలుస్తోంది డొంక ఎంత లోతుగా కదిలిందో. ఇంకోపక్క కర్నాటకలో కూడా డ్రగ్స్ వ్యవహారం సంచలనాలు రేపుతున్నది. బుజ్జి గాడు సినిమాలో యాక్ట్ చేసిన కన్నడ నటి సంజనా తో పాటు రాగీణీ ద్వివేదీ ని అరెస్ట్ చేసింది NCB. ఇక సంజనా అయితే తన వెనుక చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అంటూ పోలీసులని బెదిరించే దాకా వెళ్లింది అంటే అర్ధం చేసుకోవచ్చు దీని వెనక ఎంత పెద్ద రాకెట్ ఉందో. షరా మామూలుగానే వీటన్నిటినీ మూసేస్తారా లేక లెక్కలు బయటికి తీసి లోపలేస్తారా ? మోటా భాయ్ తలుచుకుంటే ఇదో పెద్ద విషయం కాదు కదా ?

జైహింద్ !

Courtesy: పార్ధసారధి పోట్లూరి గారు …✍

(Visited 281 times, 1 visits today)
Author: kekanews