ఢిల్లీ అల్లర్లు ఎవరి కుట్ర…?

Spread the love

(Facebook lo KrantiDevMitra వాల్ నుంచి తీసుకోవడం జరిగింది. జాతీయవాదులకు తప్పకుండా ఈ మెసేజ్ చేరాలన్న ఉద్దేశంతో కేక లో పోస్ట్ చేస్తున్నాం)

ఢిల్లీలో ఏం జరుగుతోందో ఒక్కసారి ఆలోచించండి. బట్ట కాల్చి ఎదుటువారి మీద వేసి తేల్చుకోమని చెప్పడం కాదు.. వాస్తవాలను గమనించండి..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రోజుల తరబడి ఆందోళనలు కొనాసాగుతున్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశ పర్యటనకు వచ్చినప్పుడే అల్లర్లు చెలరేగడం ఎందుకు? కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి..
మన దేశ భద్రతను కోరుకునేవారు, సార్వభౌమత్వాన్ని గౌరవించేవారు, అక్రమ చొరబాటుదారులను వ్యతిరేకించేవారంతా సహజంగా పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలుకుతున్నారు. ట్రంప్ వచ్చినప్పుడు అల్లర్లు జరిగి దేశ ప్రతిష్ట దెబ్బతినాలను వారు భావించే అవకాశమే లేదు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వర్గాలకు ట్రంప్ పర్యటన ఒక అవకాశంగా దొరిగింది. హింసకు పాలకపడితే దేశ ప్రతిష్టను మసకబార్చవచ్చనే కుట్ర దీని వెనుక ఉంది.
అల్లర్లకు బీజేపీ, హిందుత్వ శక్తులే కారణం అని ఆరోపణలు చేసేవారికి రాజకీయ కారణాలు కచ్చితంగా ఉంటాయి. దేశాన్ని పాలించే పార్టీ ట్రంప్ వచ్చిన సమయంలో అల్లర్లు చెలరేగి దేశ ప్రతిష్ట దెబ్బతినాలని కోరుకుంటుందా? బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా వ్యాఖ్యలు సమర్ధనీయం కాకున్నా అల్లర్లకు అవే కారణం అనేది ఓ కుంటిసాకుగా కనిపిస్తోంది. మరి సీఏఏ వ్యతిరేకులు, ఎన్ని రెచ్చగొట్టే ప్రకటనలు, టుకుడే టుకుడే నినాదాలు చేయలేదు? వాటి సంగతి ఏమిటి? హిందుత్వ శక్తులు రాజకీయ లబ్దికోసం హింసను కోరుకుంటే అదేదో ఢిల్లీ ఎన్నికలకు ముందే చేసేవి కదా?
కారణాలు ఏమున్నా ఢిల్లీలో హింసకు పాల్పడినవారిని, అందుకు కారణమైనవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఈ శిక్షలు భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి ఒక హెచ్చరికగా ఉండాలి..

(Visited 114 times, 1 visits today)
Author: kekanews