కేసీఆర్.. చెక్కరొచ్చే రైతు ప్రకటన ఏడ బాయె

CM KCR Good News To Farmers

ప్రపంచం కళ్లు తిరిగే ప్రకటన చేస్తానన్న సీఎం

ఏం ఉండబోతోంది.. ఎప్పటికి రాబోతోంది

అది ఫస్ట్ లుక్ మాత్రమేనా.. టీజర్లు , ట్రైలర్లు ఉన్నాయా

ఎలక్షన్ నాటికి గానీ ప్రకటన రాదా

రకరకాల వాదనలు

వర్షాకాలం సీజన్ నడుస్తోంది. రైతుల సీజన్ కు తగ్గట్టుగా పంటలు వేసుకున్నారు. నీళ్లు ఉన్నవాళ్లు పారించుకుంటున్నారు. నీళ్లు లేనివాళ్లు.. డబ్బాల్లో మోసుకొచ్చి మొక్కలు తడుపుకుంటున్నారు. ఎరువులు కొనుక్కొంచుకుంటున్నారు. మందుచల్లుకుంటున్నారు. వరికి సంబంధించి.. సర్కారు చెప్పినట్టుగా కాకుండా.. రైతు తనకు తోచినట్టుగానే.. ఏండ్లసంది తనకు అలవాటైన పద్ధతిలోనూ సాగు చేస్తున్నాడు.

సన్నాలో.. దొడ్డువో.. ఏదో ఒకటి వేసుకుంటున్నాడు రైతు. సర్కారు చెప్పిన నియంత్రిత పద్ధతిలో సాగుకు కూడా చాలామంది రైతులు ప్రిపేరయ్యారు. కానీ.. అధికారులనుంచి సమాచారం లేకపోవడంతో.. ఇప్పటికైతే పాత పద్ధతిలోనే కానిచ్చేస్తున్నారు. మరి.. రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతానన్న ఆ శుభవార్తేమిటో మాత్రం బయటకు రాలేదు. దేశమంతా చెక్కరొచ్చి గిరగిరా తిరిగిపడిపోయే ఆ వార్తేమిటో మాత్రం తెలియడంలేదు.

మే 27. కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం.. రైతులకు శుభవార్త చెబుతానన్న రోజు ఇదే. ఇప్పటికైతే.. నెలన్నర రోజులు పూర్తయింది. వారంరోజుల్లోనే రైతులకు గుడ్ న్యూస్ చెబుతా అన్నారు సీఎం. ఆ ప్రకటన అటే పోయింది. ఇప్పటికైతే సీఎం నుంచి  ప్రకటన కూడా రాలేదు. ఇంతకీ అది దేనికి సంబంధించినది అనేదానిపై పెద్దఎత్తునత చర్చే జరిగింది.

రైతులకు సీఎం కొత్త వరం ఏం ఇవ్వబోతున్నాడు… రైతులకు పెన్షన్ ఇస్తాడా.. రైతుబంధు డబుల్ చేస్తాడా… ఎరువులు ఫ్రీగా ఇస్తాడా.. ఇంకేదైనా నిజంగానే చెక్కరొచ్చే ప్రకటన ఏదైనా ఉంటుందా అని రైతులతో పాటు.. జనం కూడా ఎదురుచూశారు. ఫామ్ హౌజ్ లో క్వారంటైన్ నుంచి సీఎం హైదరాబాద్ రావాలి.. సెక్రటేరియట్ హడావుడి తగ్గాలి.. కరోనా ఆగమాగం పోవాలి.. ఆ తర్వాతే రైతుల ప్రకటన అంటున్నారు చాలామంది. అంటే.. అప్పటికల్లా… మళ్లీ ఎలక్షన్స్ వచ్చేస్తాయన్నది కొందరి వాదన. అంటే.. ఎన్నికల ముందు.. రైతులకు మరో భారీ తాయిలం ఈ ప్రకటన రూపంలో అందిస్తారని అంటున్నారు. మొన్నటి సీఎం రైతు ప్రకటన ఫస్ట్ లుక్ మాత్రమే అని.. దీనికి టీజర్లు, ట్రైలర్లు, రిలీజయ్యాక.. ఆ తర్వాత సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు. సీఎం చెప్పే ప్రకటన వింటే.. రైతు సంతోషపు కేక పెట్టాలన్నదే అందరి ఆలోచన.

(Visited 45 times, 1 visits today)