Socila Media
ఇప్పుడే జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ హెడ్ క్వార్టర్స్‌లో ఇచ్చిన స్పీచ్..
—————————–
ఎంత ఖంగారు పడిపోయార్రా జనం పాపం.. 15 నిమిషాల్లో మొత్తం అల్లకల్లోలం అయిపోయింది.
ఏదైనా భలే రికవర్ చేశార్రా.. భలే రీస్టోర్ చేశారు. సర్వర్ ఆన్‌లో ఉంటే చాలు.. ఆ తర్వాతే ఏదైనా..
అదిగో చూడు.. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ వాడు ఉన్నాడు.. వీకెండ్ చాటింగ్ చేస్తున్నోడు ఉన్నాడు.. గర్ల్ ఫ్రెండ్‌తో వీడియోకాల్ మాట్లాడుతున్నోడు ఉన్నాడు.. క్లిప్పులు షేర్ చేసుకుంటున్న ముసలోళ్లు కూడా ఉన్నాడు. ప్రతీ ఒక్కడి బాధ ఒక్కటే..
మార్క్ మామా వెంటనే వాట్సప్ ఆన్ చెయ్.. మామా వెంటనే ఇన్‌స్టాగ్రామ్ ఆన్ చెయ్..
అవన్నీ చూసి నటన అనుకుంటున్నావా? అవి నటన కాదహే.. మనం ఇన్ని రోజులు తయారు చేసుకుపెట్టుకున్న స్ట్రాటజీ..
మన యూజర్లు పిచ్చోళ్లురా.. యూజరంటేనే పిచ్చోడు.
ఏమిచ్చాన్రా వాళ్లకు.. ఫ్రీగా అకౌంట్లిచ్చాను. పోయి దున్నుకోండిరా అని. ఒక క్యాపిటలిస్టుగా ఏమివ్వగలనురా ఈ ప్రపంచానికి.. బానిసలను చేసుకునే యాప్స్ తప్ప. దానికి మించి ఏమైనా ఉందా?
ఇగో ఈ జన్మకే నువ్వు వాట్సప్ హెడ్డు.. ఈ జన్మకే నువ్వు ఇన్‌స్టాగ్రామ్ హెడ్డు.. ఈ జన్మకే నేను మీ సీఈవో జుకర్‌బర్గ్.
జన్మలదాకా ఎందుకు.. ఇంకో నాలుగు సార్లు హ్యాక్ చేస్తే మనం ఉంటామో పోతామో తెలియదు. అందుకే కనపడిన ప్రతీ యూజర్‌ని కట్టిపడేయాలి. వాళ్లందరినీ మన గుప్పిట్లో పెట్టుకొని వెళ్లిపోతే చాలు. అంతే.. ఇక నేను రాయలేను
(Visited 108 times, 1 visits today)