1 మినిట్ రూల్.. మైండ్ లెస్ నిర్ణయం.. తీసిపారెయ్యండి సర్!

inter 1 minute rule
Spread the love

(ఇంటర్, ఎంసెట్ ఎగ్రామ్స్ లో  విద్యార్థులకు ఇబ్బందిగా మారిన 1 మినిట్ రూల్ గురించి… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ కేక రీడర్స్ కోసం.)

కాళ్లు పట్టుకుంటా సార్, పరీక్ష రాయనివ్వండి సార్, అని కాళ్లు పట్టుకుంటున్న విద్యార్థిని….
చాలా చోట్ల హాల్ టికెట్లు ఇచ్చే దిక్కులేదు…
ఆ దిక్కుమాలిన నిమిషం నిబంధన మాత్రం ఘనంగా, గొప్పగా చెప్పుకునే ‘మైండ్ లెస్’ విద్యాశాఖ అధికారులకు జోహార్లు…
దీన్ని సమర్థించే ‘పెద్ద మనుషులకు’ మరీ మరీ జోహార్లు…యేళ్ళ తరబడి కోర్టులలో న్యాయం లేటు…!
నిమిషం లేటైనా పరీక్షకు రానివ్వం
అనే నిబంధన
అధికారుల అమానుషత్వానికి ప్రతీక..
ప్రభుత్వ అజ్ఞానానికి, పరాకాష్ట
అహంకారానికి నిదర్శనం.
అర్థరహితమైన ఈ నిబంధన కొనసాగడం అహేతుకం.
దీనిని తల్లిదండ్రులు, విద్యార్థిసంఘాలు, విద్యాసంస్థలు కూడా నిరసించాలి.
ఒక విద్యార్ధి పరీక్షకి పది నిముషాలు లేటుగా వెళితే అతడి టైం అతడే నష్టపోతాడు
దానిని “మాల్ ప్రాక్టీస్” కింద, దారుణ నేరం కింద భావించి
పరీక్షకి హాజరు కాకుండా ఆపేయడం సిగ్గుచేటు పని.
ఒక్క రైలు, ఒక్క బస్సు టైముకి నడవదు..
ఒక్క మీటింగ్ కి .. ఒక్క నాయకుడు చెప్పిన టైముకి రాడు ప్రభుత్వం చెప్పిన ఏ పనీ..
ఇచ్చిన ఏ హామీ సకాలంలో అమలు కాదు అంతెందుకు..
ఏ రెండు వాచీలు ఒకే టైము చూపించవు…
ఇలాంటి పరిస్థితి అడుగడుగునా ఉన్న ఈ దేశంలో విద్యార్ధి మాత్రం పరీక్షకి నిమిషం కూడా లేటవకూడదు
అనడం దారుణం….
యేళ్ళ తరబడి ప్రభుత్వ ఆఫీస్లలో ఫైళ్ళు జాప్యం…
తరతరాలుగా ప్రభుత్వ అధికారులు విధులకు రావడం లేటు….
కానీ Students Exam ఒక్క నిమిషం లేటయితే ఆ ఆవకాశం కోల్పోవడమే…అన్యాయం కాదా…?
నిమిషం లేటు అనేది నిర్ణయించేదవరు…?
వాచ్ నీదా …?
నాదా…?
principal దా?
వాచ్ మేన్ దా?
College watch & Watchman వాచ్ ఒకే time చూపిస్తున్నాయా….?
విద్యావిధానమే బాగోలేదని ఆవేదన పడుతుంటే ఈ నిమిషం /అరనిమిషం గోలేంటి….?
దయచేసి 1 నిమిషం నిబంధన తొలగించి
విద్యార్థులకూ అవకాశం కల్పించాలి. ప్రతి ఒక్కరు
రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు షేర్ చేసి ప్రశ్నించండి…

(Visited 98 times, 1 visits today)
Author: kekanews