5000సార్లు రేప్.. ఆ ఒక్కమ్మాయికే జరిగిందా..? చదవాల్సిన పోస్టు

139 members Rape on a Woman 5000times
Spread the love
5,000 సార్లు రేప్ జరిగిందా… ???
139 మంది రేప్ చేశారా…???
9 సంవత్సరాల నుండి ఇంతటి దారుణం జరుగుతుంటే అమ్మాయి ఏం చేసింది ???
అప్పుడే ఖండించి ఉంటే లేదా పోలీసులకు ఆశ్రయించి ఉంటే ఇంత జరిగేదా…???
సరిత పై జరిగిన అత్యాచారం విషయంలో చాలామంది అనుకుంటున్న మాటలు..
కాని వాస్తవానికి…
ఇంత జరగడం కాదు దీనికంటే ధారుణం జరిగి ఉంటుంది కాని అమ్మాయి బయట చెప్పలేకపోతుంది.
ఇది ఒక్క సరితకు జరిగిన అన్యాయం కాదు ఈ విధంగా హైదరాబాద్ సిటి మొత్తం లక్షల మంది అమ్మాయిలకు రకరకాల మోసం చేసి వ్యభిచారం చేయిస్తున్నారు.
ఇది మీకు అర్థం కావాలంటే నేను చూసిన , నా దగ్గర వచ్చిన రెండు సంఘటనలు చెప్తాను.
ఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగి నన్ను వెతుక్కుంటూ ఇంటికి వచ్చింది.
ఆమే సమస్య నాతో ఎలా చెప్పాలి అని చాలా సేపు ఇబ్బంది పడుతుంది. ” సర్ మీరు ఏం అంటే అది చేస్తాను, కాని నేను చెప్పే సమస్య ఎవ్వరికి చెప్పకండి , లేదంటే నాకు ఆత్మహత్యనే పరిష్కారం కావచ్చు అంటు ఏడుస్తూ విషయం చెప్పింది.
ఆమే పనిచేస్తున్న డిపార్టుమెంటులో ఒక ఉద్యోగి ఆమెతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. వారి పరిచయం ఇరువురి కుటుంబాలు పండుగలకు , పబ్బాలకు కలిసే వరకు పోయింది. (ఇద్దరు వివాహితులు, ఇద్దరికి పిల్లలు ఉన్నారు). ఒకరోజు అతని పుట్టిన రోజు ఆఫీసు నుండి మహిళ ఉద్యోగిని ఇంటికి తీసుకొచ్చాడు, ఇంట్లో ఎవరు లేకపోయో సరికి ఆమెకు అనుమానం వచ్చి అడిగితే నా భార్య పిల్లలు మా చుట్టాల ఇంట్లో పూజ ఉంటే వెళ్ళారు , ఒక పది నిమిషాల్లో వస్తారు అప్పటి వరకు కూల్ డ్రింక్ తాగండి అని ఫ్రిజ్ నుండి కుల్ డ్రింక్ తీసిచ్చాడు.
కుల్ డ్రింక్ తాగిన తర్వాత ఏం జరిగిందో ఆమే కు తెల్వదు. దాదాపు రెండు గంటల తర్వాత ఆమే కు స్పృహ వస్తే ఆమే బెడ్ రూం లో ఉంది. అక్కడ ఏం చేయాలో తెల్వదు, అతడికి విషయం అడిగితే మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇలా చేశాను. ఎవరికైనా చెబితే ఈ వీడియో మీ భర్తకు పంపిస్తాను , అందరికి పంపిస్తాను అని బెదరించాడు. ఈ విధంగా ఆ మహిళ ఉద్యోగికీ బ్లాక్ మెయిల్ చేస్తూ దాదాపు రెండు సంవత్సరాల నుండి వాడుకుంటున్నాడు. తర్వాత వాడు వాడుకోవడమే కాదు వాడి ఫ్రెండ్స్ దగ్గర వెల్లాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.
ఈ సమస్య భర్తతో చెప్పుకోలేదు చెప్తే పెద్ద సమస్య
పోలీసులకు ఫిర్యాదు చేయలేదు చేస్తే పరువు పోతుంది.
ఆత్మ హత్య చేసుకుందామా అంటే ఇద్దరు చిన్న పిల్లల ఆ ధైర్యం కాలేదు…
రెండు సంవత్సరాల నుండి ఎన్ని సార్లు రేప్ చేయబడ్డదో ఆమెకే తెల్వదు. ఆమే పడ్డ శారీరక , మానసిక వేదన మాటల్లో చెప్పరానిది. 24 గంటలు అదే ఆలోచన , అదే భయం, రెండు సంవత్సరాలు ఆమే భరించిన మానసిక వేదన చెప్పరానిది.
ధైర్యం చేసి నా దగ్గర వచ్చింది, నేను ఆమే ఇంట్లో తెలవకుండా , ఇతరులకు తెలవకుండా సమస్యకు పరిష్కారం ఇవ్వకపోతే ఆమేకు ఆత్మహత్యనే చివరి పరిష్కారం… నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించి సమస్యకు పరిష్కారం ఇచ్చాను. మహిళ ఉద్యోగి సేఫ్ , వాడికిచ్చిన ట్రీట్మెంట్ తో జీవితంలో వాడు వాడి పెండ్లం పక్కన కూడా పడుకోలేడు…
రెండవ సంఘటన నేను డిల్లీలో ఉన్నప్పుడు ఒకరోజు సమయం దొరికింది. డిల్లీలో వ్యభిచార అడ్డాలు ఉన్నాయి. అవి ఓపెన్ గా రన్ అవుతాయి ఎవరు పట్టించుకోరు అనే విషయం చాలామంది చెప్తుండగా విన్నాను. Women &Child trafficking లో ఇండియా ప్రపంచంలో నంబర్ వన్ అని నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన వివరాలు తెలుసుకోవడానికి ఒక పోలిస్ అధికారితో చర్చించగా, కిడ్నాప్ అయిన వారు వేశ్య గృహాలలో అమ్మేయబడుతున్నారు అని విషయం తెలుసుకున్నాక ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో అధ్యాయనం చేయడానికి వేశ్య గృహానికి వెళ్లడం జరిగింది.
ఒక అడ్డ( వ్యభిచార గృహం) లోపలికి వెల్లాను. గేట్ వద్ద ఇద్దరు బాడీ గార్డ్ లు ఉన్నారు. ఒక కౌంటర్ ఉంది కౌంటర్ లో 350 రూ. చెల్లిస్తే మనకు ఇష్టమైన అమ్మాయి దగ్గర పోవచ్చు. డబ్బులు చెల్లించాక హల్ లో ఎంట్రీ ఇచ్చారు అక్కడ అమ్మాయిలే వచ్చి నేను అంటే నేను అని ముందుకు వస్తున్నారు. నేను తెలుగు అమ్మాయి కావాలని అడిగాను. తెలుగు అమ్మాయిలు వచ్చారు , ఒకరిని సెలక్ట్ చేసి గదిలో తీసుకెళ్ళాను. ఆమేకు మాట్లాడుతుంటే నీ పని చూసుకుని వెళ్ళిపో లేదంటే శవం కూడా దొరకదు అని చెప్పింది. ఎలాగైనా మాటల్లో పడేసి ఇంకా డబ్బులు చెల్లించి రాత్రి మొత్తం ఆమెతో ఉండి వివరాలు తెలుసుకుంటే ఆ విషయం నుండి నాకు బయట రావడానికి సంవత్సరం పట్టింది.
విషయం ఏమిటంటే అమ్మాయికి ఒక ఆంటి పరిచయమయింది. పరిచయం అయిన కొన్ని రోజులకు మా ఇంటికి వెలదాము అని తీసుకెళ్ళి ఇది మా ఇల్లే అంకుల్ ఊరెల్లాడు రేపు వస్తాడు అని నమ్మించింది. వచ్చిన రాత్రే ఆమెపై రేప్ చేశారు, వీడియో తీశారు ఆ విధంగా ఒక సంవత్సరం వరకు అమ్మాయికి వాడుతూనే ఉన్నారు. ఒకరోజు నీకు ఉద్యోగం ఇప్పిస్తాను నాకు డిల్లీ లో పరిచయం ఉన్నవారు ఉన్నారు అని డిల్లీ తీసుకెళ్ళి అక్కడ ఆమెను వ్యభిచార గృహంలో అమ్మేశారు.
బయట వద్దామంటే రాలేదు.
వచ్చిన చేసేదేముంది అని జీవితం మీద ఆశలు వదులుకుని అలానే జీవిస్తుంది…
ఇప్పడు ఆలోచించండి సంఘటన 1 లో మహిళ ఉద్యోగి రెండు సంవత్సరాల పాటు ఎన్ని సార్లు రేప్ చేయబడ్డది. సంఘటన 2 లో డిల్లీ వేశ్య గృహంలో ఉన్నా అమ్మాయి ఎన్ని సార్లు, ఎంత మందితో రేప్ చేయబడ్డది..???
Child trafficking లో భారత దేశం ప్రపంచంలో 1 స్థానంలో ఉంది.
2005 లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ప్రతి సంవత్సరం 40,000 మంది పిల్లలు కిడ్నాప్ అవుతారు అందులో 76 % అమ్మాయిలు. వీరిలో సంవత్సరానికి కనీసం 11,000 ఆచూకి లభించదు వీరందరినీ వేశ్య గృహల్లో అమ్మేసి వారితో వ్యభిచారం చేయిస్తారు.
CBI (Central Bureau of Investigation) 2009 లో ఇచ్చిన రిపోర్టు ప్రకారం భారతదేశంలో 1.2 million అమ్మాయిలు వ్యభిచార వృత్తిలో ఉన్నారు. కిడ్నాప్ అయిన అమ్మాయిలను వ్యభిచార గృహాల్లో అమ్మేస్తున్నారు.
ఇది మన దేశ పరిస్థితి.
(Visited 315 times, 1 visits today)
Author: kekanews