కోటీశ్వరుడి చావుకు నలుగురే..! ఆలోచింపచేసే పోస్ట్.. చదవండి

Corona Covid 19 Dead Body Cremation
Spread the love

సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్ కేక రీడర్స్ కోసం. రైటర్ కు అభినందనలు.

——————————————————————-

హైదరాబాదులోని ఓ ప్రముఖ ఫార్మా వ్యాపారి… దాదాపు 2, 3 వేల కోట్ల ఆస్తి కలిగిన కుటుంబం… నగరంలో పెద్ద బంధుగణం… కుటుంబంలో చిన్న చిన్న ఫంక్షన్లకే 2, 300 మంది హాజరవుతారు… ఓ పెద్ద కార్పొరేటు హాస్పిటల్‌తో భాగస్వామ్యం…
.
ఈమధ్య కరోనా వచ్చింది… తను చేసేదే మందుల వ్యాపారం… ఎటు చూస్తే అటు వందల కార్టన్లలో టానిక్కులు, టాబ్లెట్లు, ఇంజక్షన్లు… అండగా కార్పొరేట్ హాస్పిటల్… డాక్టర్లు, నర్సులు, వెంటిలేటర్లు, అత్యాధునిక పరికరాలు… కానీ… జస్ట్, రోజుల్లోనే విషమించి మరణించాడు…
.
కట్ చేస్తే… అంత్యక్రియలకు పదీఇరవైమంది… అందుకే… ఓ టైం వస్తే… ఎవడూ పెద్ద కాదు, చిన్న కాదు… ఆ కట్టె కాలేచోట, ఆ దేహం పూడ్చేచోట అందరూ ఒకటే…
.
ఎక్కడ నీ బలగం… ఎక్కడ బంధుగణం… ఎక్కడ నీ భార్యాపిల్లలు
ఎక్కడ నీ ధనం, నీ నగలు, నీ భవనాలు, నీ ఆస్తులు, నీ వైభోగాలు
ఎక్కడ నిన్ను మోసుకుపోయే ఆ నలుగురు… ఎవరూ లేరు, రారు…
.
అనాథగా… ఒంటరిగా… పేలిపోవటానికి… క్షణం పట్టదు… నాలుగు రోజుల్లో…. కుమారుడు…. తండ్రి…. మన లోకాన్ని
విడిచి
స్వర్గస్తులైనారు కాబట్టి దయచేసి కుటుంబంలోని వ్యక్తిగా శ్రేయోభిలాషిగా మిమ్మల్నందర్నీ కరోనా కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. పాటించండి. జీవితాలను కాపాడుకోండి.

ప్రేమతో
మీ .
చకిలం రమణయ్య. ధన్యవాదాలు.

(Visited 126 times, 1 visits today)
Author: kekanews