అర్జున్ రెడ్డి ఈజ్ బ్యాక్.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ రివ్యూ

Vijay Devarakonda World Famous Lover
Spread the love

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ స్వీయ రచనలో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. టైటిల్ ప్రకటించినప్పుడు ఇండస్ట్రీలో మూవీపై బజ్ ఏర్పడింది. ఇపుడు టీజర్ తో …. బూమ్ అంటూ ఓ బ్లాస్టింగ్ సంచలనం క్రియేట్ అయ్యింది.

విజయ్ దేవరకొండ .. ఈయనకు ఏ రోల్ ఇచ్చినా… తన యాక్టింగ్ తో సింపుల్ గా చింపేస్తాడు. అర్జున్ రెడ్డితో ఆ విషయం తెేలిపోయింది. ఇపుడు వరల్డ్ ఫేమస్ లవర్ కూడా అలాంటి ఓ స్ట్రాంగ్ లవ్ ఇంటెన్షన్ ఉన్న ప్రేమికుడి కథే. ఓ లవర్ జీవితంలో పలు స్టేజీల్లో ఎదురైన అనుభవాలు.. ఆయన జీవితంలో నలుగురు అమ్మాయిలతో ముడిపడి ఉన్న సంఘటనలు…. ఆ లవర్ లోని ఒరిజినల్  ప్రేమ ఫీలయ్యే ఎమోషన్, ఫ్రస్ట్రేషన్, స్ట్రగుల్.. ఇలాంటి భావావేశాల కూర్పే వరల్డ్ ఫేమస్ లవర్. ఓ ప్రేమికుడి జీవితంలోని వివిధ దశలను టీజర్ లో .. అలా అలా చూపించారు. వాటన్నింటిలో.. విజయ్ దేవరకొండ కనిపించిన విధానం.. ఆసమ్. ఓ అర్జున్ రెడ్డిలా… మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నాడని మాత్రం అర్థమైపోతుంది.

అర్జున్ రెడ్డి తర్వాత.. అలాంటి స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉన్న క్యారెక్టర్ ను విజయ్ చేయలేదు. గీతగోవిందం ఓ కమర్షియల్ సినిమా. డియర్ కామ్రేడ్ లో కొంత డెప్త్ ఉన్నా.. ఆ మూవీ మిక్సుడ్ రియాక్షన్ తెచ్చుకుంది. విజయ్ దేవరకొండ మార్క్ కనిపించిన సినిమా పడలేదనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత… వరల్డ్ ఫేమస్ లవర్ లో.. అర్జున్ రెడ్డి లుక్స్.. అర్జున్ రెడ్డి ఫీల్.. అర్జున్ రెడ్డి ఇంటెన్స్.. అర్జున్ రెడ్డి స్ట్రగుల్.. అర్జున్ రెడ్డి ఎమోషన్.. ఇలా.. చాలామంది ఇష్టపడే హై వోల్టేజీ లవ్ ఎమోషన్ ఉన్న క్యారెక్టర్ ను విజయ్ ఈ మూవీలో చేస్తున్నాడు. రాశీఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్యా రాజేష్, ఇసబెల్లా లీటే … మూవీలో లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.

యామినీ ఐ డిడ్ నాట్ జస్ట్ స్ప్రెడ్ యువర్ లెగ్స్ యామినీ… ఐ లవ్డ్ యు.. ఐ లవ్డ్ యూ.. ఈ డైలాగ్ టీజర్ మొత్తంలో హైలైట్ అని చెప్పాలి. లవ్ లో ఉన్న డెప్త్ ను…. ఈ ఒక్క డైలాగ్ తో హీరోతో చెప్పించాడు డైరెక్టర్ క్రాంతిమాధవ్. ఫిజికల్ కాంటాక్ట్ కు… లవ్ కు సంబంధం ఉండదని .. ప్రేమ అనేది మనసుకు సంబంధించిన ఎమోషన్ అని చెప్పాడు విజయ్ దేవరకొండ.

గోపీసుందర్ ఇచ్చినబ్యాక్ గ్రౌండ్ స్కోరు… అలా అలా కనిపించి వెళ్లిపోయిన సీన్స్.. మూవీలో ఏదో ఉండబోతోందన్న క్యూరియాసిటీ పెంచేశాయి. వాలంటైన్స్ డే సందర్బంగా ఫిబ్రవరి 14న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రిలీజ్ కానుంది.

 

(Visited 759 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *