థాంక్ గాడ్.. వెంకయ్య కోలుకున్నారు

Venkaiah Naidu

కరోనా ఎవరిని వేటాడుతుందో.. చెప్పలేని పరిస్థితి.

దేశంలో ప్రముఖులైన ఎందరినో కరోనా కాటేసింది. వారి ఆరోగ్యాలను పీల్చిపిప్పిచేసి.. ఇబ్బందిపెట్టింది. ఐతే.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోలుకున్నారన్న వార్త చాలామంది తెలుగువారిలో ఆనందం నింపింది.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెప్టెంబర్ 29న కరోనా పాజిటివ్ అయ్యారు. కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో..ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. టెస్టుల్లో పాజిటివ్ రావడంతో.. డాక్టర్ల సలహాతో హోం ఐసోలేషన్ లో ఉండిపోయారు.

డాక్టర్లు వెంకయ్య ఆరోగ్యాన్ని ప్రతిరోజూ పరీక్షించారు. 14 రోజుల క్వారంటైన్ పీరియడ్ తర్వాత.. జరిపిన టెస్టుల్లో వెంకయ్యకు కరోనా నెగెటివ్ వచ్చింది.

కరోనానుంచి ఉపరాష్ట్రపతి కోలుకున్నారని ఆయన కార్యాలయం ప్రకటించింది. ఆహార, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొనసాగించాలని ఆయన డాక్టర్లు సూచించారు.

 

(Visited 30 times, 1 visits today)