మా ఇంట్లో పెళ్లికి రావొద్దు.. ఓ జర్నలిస్ట్ వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్

Online Wedding Invitation
Spread the love

కరోనా కారణంగా.. మనతో పాటు.. మన పక్కవారి క్షేమాన్ని కోరుకుంటున్నాం. కరోనా మన జీవితాల్లో ఎన్ని మార్పులు తీసుకొచ్చిందో మాటల్లో చెప్పలేం. సభల్లేవు.. సమావేశాల్లేవు… పదిమంది కలిసి ఓ చోట దగ్గరగా చేరి.. ధైర్యంగా మాట్లాడుకునే పరిస్థితులే లేవు. ఫంక్షన్లు లేవు.. పార్టీలు తగ్గిపోయాయి.. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు కూడా కళ తప్పిపోయాయి.

కల్యాణం వచ్చినా.. కరోనా వచ్చినా.. పెళ్లి మాత్రం ఆగదంటారు. అందుకే… మహమ్మారి సమయంలోనూ పెళ్లిళ్లు జాగ్రత్తలతో చేసుకుంటున్నారు. చాలామంది తమ పెళ్లిళ్లకు ఏదో  మాటవరసకు చుట్టాలకు, స్నేహితులకు చెబుతున్నారు. మా పెళ్లికి రండి అని మనసారా చెప్పలేకపోతున్నారు. పెళ్లికి వస్తే.. ఎవరితో ఎవరికి కరోనా అంటుకుంటుందో అన్న టెన్షన్. అందుకే.. ఓ తెలుగు జర్నలిస్ట్ కొత్తగా ఆలోచించాడు. తన కూతురు పెళ్లికి బంధువులు, స్నేహితులను అందరినీ ఆన్ లైన్ అతిథులను చేశాడు. ఆయనే నిజామాబాద్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ యాటకర్ల మల్లేశ్. హైదరాబాద్ లో వీ6 న్యూస్ లో సీనియర్ జర్నలిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. తన కూతురు పెళ్లి ఆహ్వాన పత్రికను ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. ఈవెంట్ ను కూడా అంతే డిఫరెంట్ గా నిర్వహిస్తున్నాడు.

సకుటుంబ సమేతంగా మా ఇంటికి పెళ్లికి రండి నోరారా పిలవలేని పరిస్థితి. మీరు క్షేమంగా ఉంటే.. మేము బాగున్నట్టే. పిలవకుండానే పలకరించి వాటేసుకోవడానికి కరోనా రెడీగా ఉంది కాబట్టి.. మా ఇంటి పెళ్లి వేడుకకు దయచేసి ఎవరూ రావొద్దని ఆప్యాయంగా చెప్పేశాడు. ఐతే… వారందరినీ ఆ పెళ్లి వేడుకకు అతిథులుగా చేసేందుకు సోషల్ మీడియాలోని పలు ప్లాట్ ఫామ్స్ ను సిద్ధం చేశాడు. చుట్టాలు, బంధువులు, శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్.. పెళ్లి వేడుకను తమ ఇంట్లోనుంచే చూసేలా.. ఏర్పాట్లు చేశాడు.

పెళ్లికానుక ఎవరైనా ఇస్తే.. దానిని మాతృదేవోభవ ఫౌండేషన్ కు ఇవ్వాలంటూ.. GooglePay Number 9492225111 డీటెయిల్స్ ను పెళ్లికార్డులో షేర్ చేశాడు. (కార్డ్ డీటెయిల్స్ , లింక్స్ కింద చూడొచ్చు.) మల్లేష్ మంచి మనసుకు ఇదో ఉదాహరణ.

13వ తేదీ ఆగస్ట్ 2020 గురువారం నాడు.. ఉదయం 11.15 నిమిషాలకు మణికొండ శివాలయం ఆవరణలో జరిగే పెళ్లి వేడుకను లైవ్ లో ప్రసారం చేయనున్నారు.

AV News Media(Contact No: +919133322345) సౌజన్యంతో.. ఫేస్ బుక్, యూట్యూబ్ లలో లైవ్ ప్రసారం కానుంది. “13 నాడు మా ఇంట్లో పెళ్లి. కరోనా కాలంలో జరిగే ఈ పెళ్లిని online లో చేస్తున్నాం. మీరు కింది లింక్ ప్రెస్ చేస్తే లైవ్ లో చూసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతున్నా” అని ఫ్రెండ్స్ ను ఇన్వైట్ చేశాడు యాటకర్ల మల్లేశ్.

FaceBook Link :

https://www.facebook.com/avnews123/posts/2561743307471804?notif_id=1597058546837044&notif_t=live_video_schedule_broadcaster&ref=notif

 

You tube link : https://youtu.be/Dk0TCBaTHV0

(Visited 227 times, 1 visits today)
Author: kekanews