వీ6 ఒక్కటే నిగ్గదీసి అడుగుతోంది.. ఈ సిగ్గులేని సర్కారును

v6 journalists
Spread the love

ఆనాడు తెలంగాణ ఉద్యమం. డెస్టినీ డిసైడర్ లాంటి టైమ్ లో.. తెలంగాణ ప్రజల గొంతును వినిపించి స్వరాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది వీ6 న్యూస్.

ఈనాడు కరోనా ఆపత్కాలం.  ఫ్యూచర్ ఉంటుందో ఉంటుందో తెలియని ఈ టైమ్ లోనూ.. తెలంగాణ ప్రజల ఆరోగ్య హక్కును కాపాడేందుకు బాధితుల తరఫున గొంతుకై నిలుస్తోంది వీ6 న్యూస్ – వెలుగు పేపర్. ఐనా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా అనిపించడం లేదు.

కరోనా హమమ్మారి విజృంభణ ఆరంభంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించి అలర్ట్ చేసింది. జనం ఇబ్బంది పడినా.. సర్కారు చేస్తున్నదే కరెక్ట్ అని చెప్పింది. లాక్ డౌన్ సడలింపుల పేరుతో ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నప్పుడు .. ప్రశ్నించే సమాజం అంతా చేష్టలుడిగి చూస్తున్నవేళ అదే వీ6 నిగ్గదీసి ప్రశ్నిస్తోంది.

కరోనా విసురుతున్న సవాళ్లు ఎన్నో.  టెస్టులు ఎవరికి చేస్తున్నారు.. పాజిటివ్ వచ్చిన వారికి ఎటువంటి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.. వైరస్ సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు..  అంటూ.. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది వీ6 న్యూస్.

కేంద్రం లాక్ డౌన్ నిర్ణయంతో ఇబ్బంది పడిన వలస కార్మికులు, పేదలు, కూలీల కష్టాలను కొన్ని వారాల పాటు హైలైట్ చేసింది.

కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ లో ఒకరైన జర్నలిస్టులను ఇపుడు కరోనా కాటేస్తోంది. ఈ సమయంలో.. కొన్ని సంస్థలు.. ఆ అంశాన్నే బయటకు చెప్పడం లేదు. వీ6 జర్నలిస్టులందరి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం .. కనీసం పద్ధతిగా ట్రీట్ మెంట్ అందించి వారి ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేసింది. తమను పట్టించుకునేవాడే లేకుండా పోయాడని ఆవేదనలో కుంగిపోతున్న సాటి జర్నలిస్టులు, పోటీ సంస్థల్లోని ఉద్యోగులు అందరికీ అండగా నిలబడింది. కొండంత భరోసానిచ్చింది. “మా సంగతేంటి” అని జర్నలిస్టులందరి తరఫున ప్రభుత్వాన్ని కాలర్ పట్టుకుని నిలదీసింది. రోజంతా కథనాలు ప్రసారం చేసి.. తీన్మార్ లో ప్రధాన వార్తను ప్రసారం చేసింది.

పేరుకే ఫ్రంట్ లైన్ వారియర్స్. కానీ.. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది.. వీరికి కరోనా టైమ్ లో లభిస్తున్న వెసులుబాట్లు, సౌకర్యాల్లో ఒక్కటంటే ఒక్కటీ జర్నలిస్టులకు దక్కడం లేదు. వైరస్ వ్యాప్తి, ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్న రాష్ట్రంలోని ప్రెస్, మీడియా .. ఇపుడు కరోనా రిస్క్ లోపడిందని.. వాటిని ఆదుకోవాల్సి ఉందని ప్రభుత్వానికి బాధ్యత గుర్తుచేసింది.

కరోనా కారణంగా టీవీ5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ కుమార్ యాదవ్ చనిపోవడం… ఫీల్డ్ లో పనిచేస్తూ.. ఇన్ఫెక్ట్ అవుతున్న టెక్నీషియన్లు, రిపోర్టర్లు హాస్పిటల్ పాలవడం.. గాంధీ హాస్పిటల్ లోనూ వారికి కనీసం మంచి నీళ్లు ఇచ్చే దిక్కు లేకపోడవంతో.. వారి అందరి తరఫున వీ6 న్యూస్ గొంతెత్తింది. జనాలను అలర్ట్ చేయడంలో.. ప్రాణాలు రిస్క్ లో పెట్టుకున్న జర్నలిస్టులను కాపాడేందుకు ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్నది చూడాలి.

(Visited 171 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *