ఆగస్ట్ 5 నుంచి.. ఏది లాక్..? ఏది అన్ లాక్..??

Lock Down In India

అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర హోంశాఖ. ఆగస్ట్ 5 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. సినిమా థియేటర్లు 25శాతం మందితో ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం చెప్పినప్పటికీ.. ఆ కొద్దిమందితో థియేటర్లు నడపలేమని యాజమాన్యాలు చెప్పాయి. దీంతో.. థియేటర్ల ఓపెన్ కు ఇంకా టైమ్ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • ఆగస్ట్ 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్ లకు అనుమతి
  • ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేత
  • ఆగస్ట్ 5 నుంచి రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత
  • సినిమా హాళ్లు, మెట్రో రైళ్లు, బార్లుకు అనుమతి లేదు
  • స్విమ్మింగ్ ఫూల్స్, ఆడిటోరియంలపై ఆంక్షలు కొనసాగింపు
  • ఆగస్ట్ 31 వరకు కంటైన్మెంట్ జోన్లకు లాక్ డౌన్ మరింత కఠినతరం
(Visited 59 times, 1 visits today)