సూఫియా ఖాన్ గిన్నిస్ రికార్డ్.. కశ్మీర్ నుంచి కన్యాకుమారికి పరుగెత్తింది

Ultra runner Sufiya Khan
Spread the love

ఈమె పేరు సూఫియా ఖాన్. 33 ఏళ్ల వయసున్న ఈ రాజస్థానీ రన్నర్ పేరు మార్మోగుతోంది. అసాధ్యమనుకునే లక్ష్యాలను సాధించాలనుకునేవారికి ఈమె ఓ ఇన్ స్పిరేషన్ గా నిలుస్తోంది.

Ultra runner Sufiya Khanసూఫియా.. కశ్మీర్ నుంచి.. కన్యాకుమారి వరకు జర్నీ చేసింది. అందులో వింతేం ఉంది అనుకుంటున్నారా.. ఆమె విమానంలోనో.. రైలులోనో… కారులోనో…. బైక్ పైనో అలా జర్నీ చేయలేదు. తన సొంత కాళ్లపై ఆధారపడింది. కశ్మీర్ నుంచి.. కన్యాకుమారి వరకు… ఆమె పరుగెత్తుతూ.. చేరుకుంది. అది కూడా.. కేవలం 3 నెలల లోపే. 87 రోజుల్లోనే.

అలా.. సూఫియా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. 87 రోజుల్లో 4వేల 35 కిలోమీటర్లు పరుగుతో కంప్లీట్ చేయడం మామూలు విషయం కాదు. అది వరల్డ్ రికార్డ్.

2019.. ఏప్రిల్ 25న శ్రీనగర్ నుంచి తన పరుగు మొదలుపెట్టింది సూఫియా. ముందుగా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సోఫియా 100రోజులు టార్గెట్ గా పెట్టుకుంది. కానీ.. అంతకంటే 13 రోజుల ముందే.. ఆమె తన గమ్యాన్ని చేరుకుంది.

2018లో… 720 కిలోమీటర్ల దూరాన్ని 16 రోజుల్లో ఫినిష్ చేసింది ఈ రాజస్థానీ రన్నింగ్ క్వీన్. అపుడు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమె పేరు నిలిచింది.

ఎయిర్ లైన్స్ లో మొదట సూఫియా జాబ్ చేస్తుండేది. తన ప్యాషన్ కోసం … ఆ జాబ్ వదిలేసింది. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ.. శాంతి సందేశం ఇస్తూ ఆమె సాగిపోయింది. ప్రతి చోటా.. స్థానికులతో మాట్లాడి..తన పరుగులో వారిని భాగం చేసేది. తను సాధించిన గుర్తింపును ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంతోషం వ్యక్తంచేసింది.

https://www.facebook.com/SufirunforHOPE/posts/688266131707078

(Visited 643 times, 1 visits today)
Author: kekanews