ఎత్తువంపులు కాదు.. కళ్లు చెదిరే ఆమె కష్టం చూడండి

Pooja Bhalekar

పూజా భలేకర్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న మోడల్. రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లేడీ బ్రూస్ లీ మూవీ… లడ్ కీ లో నటించింది. రెండు, మూడేళ్ల కిందటే టీజర్ తో సంచలనం రేపింది.

ఫైట్స్ లో ఆమె గ్రేస్ కు ఎంతోమంది శెభాష్ అన్నారు. ప్రతి సీన్ లోనూ.. అందాలు బయటపెడుతూ.. ఆమె చేసిన పోరాటాలు చాలామంది కళ్లప్పగించి చూసేశారు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ తూ నహీ అనే పాటను రిలీజ్ చేశారు. సునీధీ చౌహాన్ పాడిన ఈ పాట.. వర్మ ఒరిజినల్ స్టైల్ ను గుర్తుకుతెస్తోంది. సాంగ్ లో…. పూజా భలేకర్ అందాలు కళ్లుచెదిరేలా ఉంటాయి. ఐతే.. వాటి మాటున ఆమె చేసిన విన్యాసాలు మాత్రం గగుర్పొడిచేలా ఉన్నాయి.

చీరలోనూ కాలెత్తి తన్నడం… ఉన్నపళంగా కాలెత్తి తలపై రౌడీలను తన్నడం.. ఎక్స్ ప్రెషన్స్.. విన్యాసాలు.. భంగిమలు… అక్కటి రెండు మాటల్లో చెప్పడానికి లేదు. సాంగ్ చూడాల్సిందే. ఎంజాయ్.

 

(Visited 80 times, 3 visits today)