ఆత్మహత్య చేసుకున్న టిక్ టాక్ స్టార్

Tik Tok Star Siya Kakkar
Spread the love

ఢిల్లీలో టీనేజ్ టిక్ టాక్ స్టార్ సియాకక్కర్ సూసైడ్ చేసుకుంది. ఆమె వయసు 16 ఏళ్లు.

టిక్ టాక్ సెన్సేషన్ అయిన సియా కక్కర్ ఖతర్నాక్ డాన్సర్ కూడా. ఢిల్లీలో.. ప్రీత్ విహార్ లోని తన సొంత ఇంట్లో సియాకక్కర్ ఆత్మహత్యచేసుకున్నారు. గురువారం జరిగిన ఈ దుర్ఘటనను ఆమె పర్సనల్ మేనేజర్ మీడియాకు చెప్పారు.

టిక్ టాక్ లోనూ.. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ లక్షల్లో ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారు.

దీనిపై ఆమె మేనేజర్ అర్జున్ సరిన్ స్పందించారు. తాను సియా కక్కర్ తో గత రాత్రి కొత్త పాట గురించి చర్చించానన్నారు.  ఉత్సాహంగానే కనిపించింది కానీ.. ఇలా చేస్తుందనుకోలేదన్నారు.

బాలీవుడ్ కు గానీ.. వినోద పరిశ్రమకు గానీ.. 2020 కలిసి రావడం లేదు. తెలుగులో అప్పట్లో ఓ టిక్ టాక్ స్టార్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం ఎంతోమంది ఫ్యాన్స్ మనసు గాయపరిచింది. ఇుపుడు సియా కక్కర్ ఆకస్మిక మరణం మరెంతోమంది అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.  సియాకక్కర్ మరణం గురించి ఇన్ స్టా గ్రామ్ లో ఫొటో గ్రాఫర్ వైరల్ బయానీ పోస్ట్ చేశారు. ఆ వివరాలు మీకోసం.

https://www.instagram.com/p/CB2cnLfH4w3/?utm_source=ig_web_copy_link

(Visited 311 times, 1 visits today)
Author: kekanews