డేంజర్ లో మనఊళ్లు.. బిహార్ కన్నా తెలంగాణ జిల్లాల్లోనే రిస్క్ ఎక్కువ

Corona In Telangana
Spread the love

బిహార్ రాష్ట్రం .. తెలంగాణ రాష్ట్రం ఒకసారి కంపేర్ చేసుకోండి. అక్కడి జనం.. అక్కడి పల్లెవాసుల వెనుకబాటుతనం కంటే మనం ఎంతో ముందు అనుకుంటుంటాం. కానీ.. కరోనా విషయంలో.. బిహార్ కంటే మన తెలంగాణపల్లెల్లోనే డేంజర్ ఎక్కువుంది. ఢిల్లీలోని పాపులేషన్ కౌన్సిల్ కు చెందిన సైంటిస్ట్ రాజీవ్ ఆచార్య ఈ విషయాన్ని బయటపెట్టాడు. ప్రముఖ బ్రిటీష్ మెడికల్ జర్నల్.. ది లాన్సెట్ లో ఈ కథనం ప్రచురితం అయిందని ఆయన తెలిపాడు.

దేశంలో.. కరోనాను హ్యాండిల్ చేయడంలో చాలా రాష్ట్రాలు ముందున్నాయి. ఇన్నాళ్లు మెట్రో నగరాల్లో మాత్రమే కేసులు ఎక్కువగా వస్తుండేవి. ఐతే.. ఇపుడు మెట్రో నగరాలను దాటి…. జిల్లాల్లోనూ.. పల్లెల్లోనూ వైరస్ విస్తరిస్తోంది. ఈ స్టేజీలో… దేశంలో ఏయే రాష్ట్రాలు అలర్ట్ గా ఉండాలన్నది ఆయన వివరించారు.

అన్ని రాష్ట్రాలకన్నా.. మధ్యప్రదేశ్ లో ఎక్కువ ముప్పు పొంచి ఉంది. ఆ తర్వాత.. మన తెలంగాణ జిల్లాల్లోనే డేంజర్ ఎక్కువుంది. ఆ తర్వాత బిహార్ రాష్ట్రం సహా.. 9 పెద్ద స్టేట్స్ ఉన్నాయి.

జిల్లాల్లో ఉండే జనాభా.. సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ఇండ్లు, నివాసాలు, పరిసరాలు పరిశుభ్రత, మహమ్మారి వస్తే తీసుకునే జాగ్రత్తలు.. ఆరోగ్య వ్యవస్థ… ఇలాంటి పలు అంశాలను పరిశీలించారు. ఈ లెక్కన మధ్యప్రదేశ్ , తెలంగాణ, బిహార్ రాష్ట్రాల్లో ఈ ప్రమాణాలు సరిగా లేవని.. అందుకే.. కరోనా విస్తరణ ప్రభావం ఎక్కువగా ఉండబోతోందని బ్రిటీష్ మెడికల్ జర్నల్ అంచనా వేసింది. సో… ఈ అంచనాలు తలకిందులు కావాలంటే… ఇన్నాళ్లు ఉన్నట్టుగా కాకుండా.. పల్లె జనం.. జిల్లా జనం… శానిటైజర్లు, మాస్కులు వాడాలి. అప్పుడే… కరోనా ముప్పు నుంచి పల్లె జనం రక్షించబడతారు.

(Visited 107 times, 1 visits today)
Author: kekanews