అదే నా సక్సెస్ సీక్రెట్.. ఓపెన్ గా చెప్పిన తమన్నా

HotTamanna F2 Success
Spread the love

ఏస్ యాక్ట్రెస్ తమన్నా భాటియా.. ఇటీవలే హలో యాప్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది. తమన్నా చెప్పిన ఆన్సర్ ఇన్ స్పైరింగ్ గా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తమన్నా చెప్పిన సీక్రెట్ మంత్రాస్.

తమన్నా మాటలే ఆమె కెరీర్ పై పెంచుకున్న అభిమానం ఎంతో చెప్పకనే చెబుతున్నాయి. కెరీర్ ను ఎంచుకునేముందు.. పనిపై డెడికేషన్ మస్ట్ గా ఉండాలనే విషయం అర్థమవుతుంది.

తమన్నా ఏం చెప్పిందంటే..”నేను 13 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. నా ప్యాషన్ ను కెరీర్ గా మల్చుకోవడం పట్ల నేను అదృష్టవంతురాలిని అనుకుంటాను. ఇష్టమైన కెరీర్ కాబట్టి.. కష్టపడి పనిచేయడంతో.. అవకాశాలు కూడా వచ్చాయి. కెరీర్ లో ఏ టాస్క్ వచ్చినా.. బెస్ట్ ఇవ్వాలని అనుకోవాలి. నేను మాత్రం అదే పనిచేస్తాను. మొదట్లో.. చిన్న పాత్ర దొరికినా బెస్ట్ ఇచ్చాను. ఇపుడు పెద్ద పాత్రలు దొరుకుతున్నా.. అదేలాగే కష్టపడుతున్నా.. ఇదే నా సక్సెస్ సీక్రెట్.” అని తమన్నా చెప్పింది.

తమన్నా ప్రస్తుతం సీటీమార్ సినిమా చేస్తోంది. గోపీచంద్ హీరో. సంపత్ నంది డైరెక్టర్. తమన్నా నటించిన బాలీవుడ్ మూవీ క్వీన్ రీమేక్ త్వరలో రిలీజ్ కానుంది.

(Visited 831 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *