వాహ్… వాహ్… ది బెస్ట్ కట్ టీజర్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇదీ ఇంద్రగంటి మోహనకృష్ణ V సినిమా టీజర్ గురించి వినిపిస్తున్న టాక్. SS Thaman అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ ఓ రేంజ్ లో కి చేరిపోయింది. బీజీఎం గూస్ బంప్స్. ప్రతి బీట్ కు తగినట్టుగా టీజర్ ఎడిట్ అయింది. అందుకే.. రెస్పాన్స్ అదిరిపోతోంది.
నాని- సుధీర్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వీ మూవీ ఇపుడు యూ ట్యూబ్ లో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతోంది. రిలీజైన టీజర్.. వెనువెంటనే నంబర్ వన్ పొజిషన్ కు వెళ్లిపోయింది. టీజర్ ను పదేపదే చూసి డీకోడ్ చేస్తున్నవారు ఎందరో.
ఎవడు హీరో.. ఎవరు విలన్… ఏ షాట్ ఎలా వాడారు.. ఏ సీన్ ఏ మలుపులోది… ఏ పంచ్ ఎక్కడ వస్తుండొచ్చు.. ఇలా.. ఎవరికి వారు రకరకాల విశ్లేషణలు చేసుకుంటున్నారు.
వీ మూవీకి అమిత్ త్రివేది సంగీత దర్శకుడు. ఐతే… బ్యాక్ గ్రౌండ్ స్కోరు మాత్రం తమన్ అందించాడు. 2019లో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ తో దుమ్ములేపిన తమన్.. 2020లోనూ వీ బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో తన ఆట మొదలెట్టాడనే టాక్ వినిపిస్తోంది.
మరోసారి టీజర్ ను.. బీజీఎంను మీరూ గమనించండి.