హిందీ మాట్లాడమన్న రిపోర్టర్ కు తాప్సీ పంచ్

taapsi hindi english
Spread the love

హీరోయిన్ తాప్సీ బాలీవుడ్ లో నటిగా జోరుచూపిస్తోంది. గ్లామర్ తో పాటు.. నటనకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు చేస్తూ.. తన మార్క్ చూపిస్తోంది. గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా.. హిందీలో మాట్లాడమన్నందుకు బదులిస్తూ.. మరోసారి వార్తల్లోకి వచ్చింది.

IFFI లో భాగంగా మహిళల అభ్యున్నతి అంశంపై ఓ కాన్ఫరెన్స్ లో ప్రెస్ తో ఇంటరాక్ట్ అయింది తాప్సీ. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కావడంతో… ఇంగ్లీష్ లోనే ఎక్కువ ప్రశ్నలకు రిప్లై ఇచ్చింది తాప్సీ. ఐతే.. ఓ రిపోర్టర్ .. ఆమెను హిందీలో మాట్లాడమన్నారు. అన్ని ప్రశ్నలకు ఇంగ్లీష్ లో ఎందుకు సమాధానం చెబుతున్నారని ప్రశ్నించారు.

Read Also :

జార్జిరెడ్డి రివ్యూ : బయోపిక్ కాదు.. కమర్షియల్ సినిమా

కల్వకుంట్ల కృష్ణ మిలన్ రావు… బయో డైవర్సిటీ కారు డ్రైవర్ ఇతనే

అప్పుడు తాప్సీ కూల్ గా రిప్లై ఇచ్చింది. తాను హిందీలోనూ మాట్లాడగలనని హిందీలోనే చెప్పింది. మరెందుకు మాట్లాడటం లేదని అడిగినప్పుడు… తాను తమిళ్, తెలుగు సినిమాల్లోనూ నటించానని గుర్తుచేసింది. తమిళ్ లో మాట్లాడతాను మీకు ఓకేనా అని హిందీలో అడిగింది. దాంతో.. అందరూ తమకు వద్దు వద్దు.. అని అరిచారు. అందుకే అందరికీ అర్థం కావడానికే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నానని ఆమె నవ్వుతో, సైగలతో రిప్లై ఇచ్చింది ఆ రిపోర్టర్ కు.

ఐతే… తాప్సీ రెస్పాన్స్ ను చాలామంది అభినందిస్తుండగా.. మరికొందరు హిందీ లవర్స్ ట్రోల్ చేస్తున్నారు. హిందీ అంటే ఆమెకు చులకన అని .. అందుకే అలా మాట్లాడిందని అన్నారు. పంజాబ్ కు చెందిన తాప్సీ మాటలను అర్థం చేసుకోలేక ట్రోల్ చేస్తున్నారని ఆమె ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.

(Visited 119 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *