క్లియోపాత్ర.. అంటే అందమే కాదు..! ధైర్యం.. సాహసం కూడా

క్లియోపాత్ర ది గ్రేట్ :
ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర మహా అందగత్తె గానే ప్రపంచానికి పరిచయం. కానీ క్లియో పాత్ర అంటే ఒక ధైర్యం, క్లియోపాత్ర అంటే ఒక సాహసం, అన్నీటికి మించి క్లియోపాత్ర అంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్.అప్పటివరకు నాణేల మీద మగ రాజుల ముద్రలు మాత్రమే ఉండేవి; నాకు తెలిసి చరిత్రలో మొదటి సారి నాణేలపై ఆడ రాణి ముద్రలు కూడా ఉండటం క్లియోపాత్ర తోనే ప్రారంభం అయ్యింది.
ఈజిప్ట్ ని పరిపాలించిన 12 వ టాలెమీ మరణించాక ఈజిప్ట్ లో సివిల్ వార్ జరిగింది. 17 సంవత్సరాల వయస్సులోనే 12 వ టాలెమీ కుమార్తె క్లియోపాత్ర తెలివి, చాకచక్యం తో అంతర్యుద్ధాన్ని అణిచివేసింది. ఒక్క నెత్తురు బొట్టు కారలేదు, ఒక్క తల తెగలేదు; కానీ అంతర్యుద్ధాన్ని ఆపింది; ఈజిప్ట్ పరిపాలకురాలు అయ్యింది.
రోమన్ చక్రవర్తుల అధికార కాంక్ష గురించి ప్రపంచం అంతా తెలుసు. ప్రఖ్యాత రోం సామ్రాజ్యాన్ని ఆనుకుని ఉన్న ఈజిప్ట్ పై రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ కన్ను పడింది. సీజర్ తో జరిగిన యుద్ధం లో ఈజిప్ట్ సైన్యం ఓడిపోయింది. సీజర్ సంబరాల్లో మునిగిపోయి మధుపానీయం సేవిస్తూ ఉండగా అతని రక్షణ వలయాన్ని ఛేదించి మారు వేషం లో జూలియస్ సీజర్ ముందు నిలబడి నా పేరు క్లియో పాత్ర, ఈజిప్ట్ పరిపాలకురాలిని అని చెప్పింది. ఐదు వలయాల చక్రవర్తి రక్షణ వ్యవస్థని దాటి ఎలా వచ్చావ్ అని అడిగితే..గెలిచిన తర్వాత ఎవరైనా బలహీనం గా ఆలోచిస్తారు, అందర్నీ నరికేశా అని చెప్పింది. క్లియోపాత్ర ధైర్య సాహాసాలకి మెచ్చి గెలిసినా ఈజిప్ట్ నే తిరిగి క్లియోపాత్ర కే ఇచ్చాడు జూలియస్ సీజర్. సీజర్ మరణం తర్వాత మార్క్ ఆంటోనీ రోమన్ పరిపాలకుడు అయ్యాక ఆంటోనీ తో కూడా క్లియోపాత్ర మెరుగైన సంబంధాలు నెలకొల్పింది.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజ్యం పక్కనే ఉన్నా ఒక్క ఇంచు ఈజిప్ట్ భూమి కూడా వేరే వాళ్ళ వశం కాకుండా చూసుకోవటం క్లియోపాత్ర వల్లనే సాధ్యమైంది. మాత్రుభాష గ్రీకు అయినా కష్టమైన ఈజిప్షియన్ భాష నేర్చుకుంది, రోమన్ నేర్చుకుంది, 12 భాషలు మాట్లాడగలిగిన పరిపాలకురాలు నాకు తెలిసి చరిత్రలో క్లియోపాత్ర ఒక్కరే.
ప్రాఛీన ఈజిప్సియన్స్ ప్రక్రుతి ని ఆరాధించేవారు. క్లియోపాత్ర “అమానా” అనే సూర్య దేవాలయాలని కట్టించింది.
తెలివి, ధైర్యం, సాహాసం, నేర్పు, Self Confidence అన్నీ కలగలిపితే ఆమే క్లియోపాత్ర. ఈ భూమి మీద క్లియోపాత్ర పుట్టి ఉండకపోతే ప్రపంచ గమనం వేరే లాగా ఉండేది అని చరిత్రకారులు అంటారు. 100 పేజీల ప్రపంచ చరిత్ర రాస్తే కనీసం ఒక్క పేజీ అయినా క్లియోపాత్ర గురించి ఉండాలి, ఉంటుంది.
ఆడవాళ్ళు అంటే అబల అని కొందరు, సబల అని మరికొందరు అంటారు. ఇలాంటి ఛీడ భావజాలానికి నేను వ్యతిరేకం. వ్యక్తులని నేను రెండు రకాలుగా చూస్తాను. 1. ఆత్మ విశ్వాసం ఉన్నవారు 2. ఆత్మవిశ్వాసం లేనివారు. నా వరకు ఆడవాళ్ళలో అందం అంటే అది వాళ్ళలో ఉండే ఆత్మ విశ్వాసం. ఎందరో మహానుభావులు, అందరిలో క్లియోపాత్ర ప్రపంచం లో అందరికంటే మహా అందగత్తె (Self confident person).
(Visited 87 times, 1 visits today)