SS రాజమౌళికి కరోనా.. కోలుకుని ప్లాస్మా ఇస్తానన్న బాహుబలి

ss rajamouli tested corona positive
Spread the love

భారతీయ దర్శక బాహుబలి రాజమౌళికి కరోనా సోకింది. #RRR సినిమా షూటింగ్, గ్రాఫిక్స్ పనులతో బిజీగా ఉన్న రాజమౌళి.. లాక్ డౌన్ టైమ్ ను బాగా వినియోగించుకున్నాడు. ఐతే.. కొద్దిరోజులుగా వారింట్లో ఉన్న అందరికీ చిన్నపాటి జ్వరం వచ్చింది.

టెస్టులు చేయించుకుంటే కొద్దిపాటి లక్షణాలతో కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా తేలిందని రాజమౌళి చెప్పాడు. ఈ సంగతిని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కుటుంబంలోని అందరం డాక్టర్ల సూచనలతో హోం క్వారంటైన్ అయి జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

డాక్టర్ల సూచనతో.. ఇంట్లోనే ఉండి యాంటీబాడీలు డెవలప్ చేసుకుంటున్నామని రాజమౌళి ట్వీట్ చేశారు. కరోనాను ఎదుర్కొంటున్నామన్నారు. కోలుకుని.. త్వరలోనే ప్లాస్మాను డొనేట్ చేస్తామన్నారు రాజమౌళి.

(Visited 94 times, 1 visits today)
Author: kekanews