మరో మంచిపని చేయబోతున్న సోనూసూద్.. బర్త్ డే స్పెషల్

Sonu Sood

ఆపదలో ఉన్నవారికి ఆలోచించేలోపే ఆదుకుంటున్న  మూవీ విలన్, రియల్ లైఫ్ హీరో సోను సూద్ మరో మంచి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు.  సమాజంలోని పేదవారికి సేవచేసేందుకు తన పుట్టినరోజును మరో అవకాశంగా మార్చుకోబోతున్నారు. కొవిడ్ సంక్షోభంలో విశ్రాంతి లేకుండా పనిచేసిన సోనూ సూద్.. తన సేవలను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. గురువారం (జులై 30) తన పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు సోనూ సూద్ ప్రకటించారు.

ఈ హెల్త్ క్యాంప్ ల  ద్వారా 50 వేల మందికి సేవలు అందించనున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ వైద్య శిబిరాలను నిర్వహించేందుకు గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులతో సోనూ సూద్ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు.

సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించబోతున్నట్లుగా సోను సూద్ ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, ఒడియా రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడానికి అక్కడి డాక్టర్లతో మాట్లాడుతున్నట్లు సోను సూద్ తెలిపారు. జులై 30న సోనూ సూద్ 47 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజును తన జీవితంలో ఒక ప్రత్యేక రోజుగా మార్చుకోవాలని సోనూ సూద్ చూస్తున్నారు. ఇవి ఎప్పుడూ నిర్వహించే వైద్య శిబిరాల మాదిరిగా ఉండవని.. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి కాబట్టి కాస్త ఇబ్బంది ఉండొచ్చని ఆయన తెలిపారు.

chari

(Visited 38 times, 1 visits today)

Next Post

మాహిష్మతి రేంజ్ గ్రాఫిక్స్..! కొత్త సెక్రటేరియట్ డిజైన్ అదుర్స్

Wed Jul 29 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="http://www.kekanews.com/sonu-sood-decided-to-one-more-nation-wide-drive-for-poor/"></div>అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైరింజన్లు తిరిగేలా.. విశాలమైన రోడ్లు డిజైన్ లో కనిపిస్తున్నాయి.<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="http://www.kekanews.com/sonu-sood-decided-to-one-more-nation-wide-drive-for-poor/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
Telangana New Secretariat Design Graphic Video

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..