మంగ్లికి హీరోయిన్ చాన్స్.. త్వరలోనే తెరపై

Spread the love

మంగ్లి అలియాస్ సత్యవతి. వీ6 న్యూస్ ఛానెల్ లో పొలిటికల్ సెటైర్ ప్రోగ్రామ్ తో పాపులరైన మంగ్లి.. సింగర్ గానూ ప్రూవ్ చేసుకుంది. మైక్ టీవీ, మంగ్లీ టీవీ ఛానెళ్లలో.. బతుకమ్మ, సంక్రాంతి , తెలంగాణ పాటలతో తన ప్రజాదరణను అంతకంతకూ పెంచుకుంటోంది. సింగర్ గా ఆమె పాడిన పాటలు.. యూ ట్యూబ్ లో హాట్ కేకులు. సినిమాల్లోనూ ఆమె పాటలు పాడుతోంది. ఇపుడు హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంటోంది.

Also Read : నేను చూపించాకే.. నన్ను చూపిస్తున్నారు

అలవైకుంఠపురములో హీరోయిన్ గా ఛాన్స్

అల్లుఅర్జున్– త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో .. మూవీలో రాములో రాములా పాట పాడింది మంగ్లి. పాటలో ఆమె గొంతులో ఊపు… ఆమె ఎక్స్ ప్రషన్స్.. వాయిస్.. అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పాట కూడా ఆల్ టైమ్ టాలీవుడ్ సూపర్ హిట్ ట్రెండింగ్ సాంగ్ గా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. శైలజ రెడ్డి అల్లుడు సహా.. పలు సినిమాల్లో పాటలు పాడినప్పటికీ.. అల వైకుంఠపురంలో ఆమెకు భారీ బ్రేక్ ఇచ్చినట్టే అంటున్నారు పరిశీలకులు.

స్టేజీ షోలు, టీవీ షోల్లో గొంతుతోనే కాదు.. తన అందంతోనూ ఆకట్టుకుంది మంగ్లి. ఆమెకు సినిమా అవకాశాలు కూడా తలుపు తట్టుతున్నాయి. హీరోయిన్ గా చేయాలని కూడా అడుగుతున్నారు. ఐతే.. తన పాపులారిటీ ని క్యాష్ చేసుకోవడం కంటే… నటిగా మంచి అవకాశాలు గుర్తించడం బెటర్ అని ఆమె ఆలోచిస్తోందట. ఊలల్లా.. ఊలల్లా.. మూవీలో ఓ ముఖ్య పాత్రలో మంగ్లి నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరోయిన్ నూరిన్ జహాన్(ఒరు ఆధార్ లవ్… ఫేమ్) కు వాయిస్ ఇచ్చింది. ఓ పాట కూడా పాడింది మంగ్లి. రాపర్ రోల్ రైడా కూడా ఓ కీ రోల్ చేస్తున్నాడు ఈమూవీ లో.

వెండితెరపై మంగ్లి అలియాస్ సత్యవతిని చూసేందుకు ఆమె అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు.

Read Also : ఇండియా, పాకిస్థాన్ మధ్య తేడా చెప్పే ఫొటో ఇది

(Visited 161 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *