బాగుంది..! కొత్త దశాబ్దంలో తొలి సంక్రాంతి పాట

sankranthi songs
Spread the love

సంక్రాంతి అంటేనే ఇంటిల్లిపాదీ జరుపుకునే పండుగ. ఏడాదికి ఒక్కసారి వచ్చే శుభసమయం. ఈ పండుగనాడు కుటుంబసమంతా కలుసుకోవాలని ఈ కాలంలో ప్రతి ఒక్కరూ అనుకుంటారు. సంక్రాంతి పండుగ అనగానే.. కుటుంబంలో అనుబంధాలు.. పల్లె బతుకుతో ముడిపడిన జీవితాలు గుర్తొస్తాయి. ఆ సందర్భాన్ని.. సంబరాలను అందమైన పాటగా తీసుకొచ్చింది iRa Films.

2020 కొత్త దశాబ్దంలో వచ్చిన తొలి సంక్రాంతి పాటగా ఈ పాట గుర్తింపుతెచ్చుకుంది. ఇప్పటివరకు వచ్చిన సంక్రాంతి పాటలకు భిన్నంగా.. కొత్త ట్యూన్ లో  ఈ పాట వినిపించింది. వినసొంపుగా ఉంది. ఎడిటింగ్ బాగా ఆకట్టుకుంటుంది. శ్రావణ భార్గవి, సాయిచరణ్ పాడిన ఈ పాటకు సత్యసాగర్ సంగీతం అందించాడు. ఆయనే పాట రాశాడు. సాహిత్యం, టేకింగ్ అన్నీకుదిరిన ఈ పాటను మీరూ ఓసారి చూడండి.

పల్లవి:-
యేటి గట్టు పక్కన
పచ్చని పైరు ఊగేనంట
నీలి ఆకాశనా
గాలి పాటాలా సందదులంటా
నేల వాక్కిళ్ళన్ని రంగులు పొంగే
సంక్రాంతి పండగ వచ్చే (2)
బాధలు అన్ని వదలాలి
భోగి మంటల్లోనా
బంధాలన్ని పెరగాలి
కనుమ ముంగిల్లోన
ఏడాది కష్టాన్ని రాసిగా పొసే
రైతే రాజుగా ఉండాలి
ఏనాడు ఆగని సూర్యుని వెలుగై
ప్రతి పల్లె వెలగాలి
సంక్రాంతి సంతోషం ఊరురంతా
సరదాల కోలాటం జాతరఅంట (2)

చ1:-
ఎద్దులు ముస్తాబయ్యెనంట పల్లెల్లోన
కట్టిన కత్తుల కోడిపందాల ఆటల్లోన
ఇంటికి ముందర గొబ్బియల్లో పాటల్లోన
ఇంటికి వచ్చిన ఆడబిడ్డల పలుకుల్లోనా
హరిదాసు పాటల ఆశీర్వాదం
అమ్మమ్మ దీవెన మనవడి సొంతం
దేశాలు మారిన మరవని భోగం
తొలి మంచు కురిసే పండుగ స్నానం
మకరజ్యోతి వెలుగు చూడగానే
మనసులోని బాధ పోయేనే……Huk

చ2:-
ఆకాసాన తారలు అన్ని నేలకు వచ్చి
ఒక్కో చుక్కై వాక్కిళ్ళన్ని రంగులు పూసి
అక్క బావకు కొత్త బట్టల హారతినిచ్చి
అరిసెలు వంటలు తీపి విందుల ఈ సంక్రాంతి
డు డు డూ బసవన్నా చేసే నాట్యం
మా ఇంటి ముందు సందడి మేళం
అందరొక్క చోటుకి చేరిన వైనం
తెలుగువారి సంస్కృతిని తెలిపే భోగం
ఏలో ఏలో ఏలేలేలో…….2

(Visited 531 times, 1 visits today)
Author: kekanews