కంటెంట్ ఉన్న సినిమా ‘రిపబ్లిక్’… ట్రైలర్ గూస్ బంప్స్ : Trailer Talk

SaiDharam Tej Republic : సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలి… ఇదే ఇప్పుడు సినీ అభిమానులు, మనసున్నవారి అందరి ఆకాంక్ష. ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా… ఈ ఆకాంక్ష సోషల్ మీడియాలో రీసౌండ్ ఇచ్చింది. అపోలో హాస్పిటల్ లో బెడ్ పైన ఉన్న సాయిధరమ్ తేజ్ ఉన్న టైంలో…. మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసి…. ఓ పాజిటివ్ మెసేజ్ ఇచ్చారు దర్శక నిర్మాతలు.

రిపబ్లిక్ మూవీ… స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా. దర్శకుడు దేవా కట్టా. ప్రస్థానంలో రాజకీయాలు, రౌడీయిజాన్ని కలిపి చూపెట్టి.. ఎవర్ గ్రీన్ క్లాసికల్ మూవీని అందించిన   దేవా కట్టా… ట్రైలర్ తోనే Atttttttttt.. అనిపించే ఇంప్రెషన్ తెప్పించాడు.

సొసైటీని బాగు చేయాలనుకునే ఓ సిన్సియర్ కలెక్టర్…  స్వార్థం చూసుకునే రాజకీయ నేతలు… పరిపాలన… నియంతృత్వం… రౌడీయిజం… ప్రజాస్వామ్యం..  ఇలాంటి చాలా అంశాలను ముడిపెట్టి… ఎమోషనల్, యాక్షన్, పొలిటికల్ థ్రిల్లర్ ను రూపొదించినట్టేనని ట్రైలర్ చూసిన ఎవ్వరినైనా అడిగితే చెప్పేస్తారు.

ట్రైలర్ కింద జనం కామెంట్లు కూడా… ఇదే చెబుతున్నాయి. మూవీలో చాలా కంటెంట్ ఉంది. పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్నారు. యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోల్లో నంబర్ వన్ పొజిషన్ సాధించింది.  దసరా కానుకగా మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.  సోలో బతుకే సో బెటర్ మూవీతో… గత డిసెంబర్ లోనూ థియేటర్లకు మంచిరోజులు తెప్పించేందుకు ట్రై చేశాడు సాయిధరమ్ తేజ్. మళ్లీ ఈసారి జనాన్ని థియేటర్లకు రప్పించేందుకు మరోసారి ప్రయత్నంచేస్తున్నాడు. ఫిలిం మేకర్ల ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుందాం.

(Visited 22 times, 1 visits today)