Rashmika : మరో రామలక్ష్మి వచ్చేసింది… శ్రీవల్లిగా రష్మిక

Rashmika : రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్ర ఎంతోమందికి గుర్తుండిపోయింది. ఆ పాత్రకున్న పరిధి… పాత్ర అభినయం… ఆ పాత్ర జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోవడానికి ఇద్దరే కారణం. ఒకరు సమంత మరొకరు డైరెక్టర్ సుకుమార్.

సమంత లాంటి అమ్మాయి కనిపిస్తే… బిచ్చగత్తె అయినా అందంగా కనపడాల్సిందే. రామలక్ష్మి క్యారెక్టర్ ను ఓన్ చేసుకుని.. తన అందాన్ని దానికి సమంత జోడించింది. ఆ పాత్ర అలా సెల్యూలాయిడ్ పై మ్యాజికల్ ముద్ర వేసేసింది.

ఇప్పుడు మరో మ్యాజిక్ మూమెంట్ కు సిద్ధమయ్యారు సుకుమార్. అడవి నేపథ్యంలో.. ప్రతిష్టాత్మకంగా అల్లు అర్జున్ తో రెండుభాగాలుగా తీస్తున్న పుష్పను.. ఓ రేంజ్ లో నిలబెట్టేందుకు ట్రై చేస్తున్నారు. పుష్ప సినిమాలో.. హీరోయిన్ రష్మిక .. శ్రీవల్లి పాత్ర పోషిస్తోంది. చీర కొంగు పూర్తిగా వేసుకుండానే.. వంగి చెవులకు దుద్దులు పెట్టుకుంటూ… మరికాసేపట్లో మల్లెపూలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న రష్మిక ఫొటోను ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫొటో… సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొంగి చూస్తున్న రష్మిక అందాలకు జనం ఫిదా అవుతున్నారు.

(Visited 24 times, 1 visits today)