అమృతకు వర్మ ఫోన్.. సినిమా ఉంటుందా.. ఉండదా..?

RamGopal Varma Amritha Pranay
Spread the love

క్రైమ్ కథలను ఇష్టపడే రామ్ గోపాల్ వర్మ.. ఈ మధ్య రియల్ స్టోరీలనే సినిమాలుగా తీస్తూ పోతున్నాడు.  మిర్యాలగూడ మారుతీరావు- అమృత – ప్రణయ్ కథను త్వరలోనే సినిమాగా తీయబోతున్నానని ఇప్పటికే ప్రకటించడం రాష్ట్రంలో  సంచలనం రేపుతోంది. ఐతే.. తన అనుమతి లేకుండా.. సినిమాను ఎలా ప్రకటిస్తారంటూ అమృత సుదీర్ఘమైన లెటర్ తో వర్మకు కౌంటరిచ్చింది. ఓ విధవరాలి జీవితంతో సినిమా తీయొద్దని.. తమను క్షోభ పెట్టొద్దని ఆమె వేడుకుంది. ఇపుడు వర్మ ఏం చేస్తాడనేది అందరూ చర్చించుకుంటున్నారు.

ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ తన సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్నాడు. ప్రధాన పాత్రలకు నటులను ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నాడు. సినిమా తీసి రిలీజ్ చేయడమే అని నిర్ణయించుకున్నాడట. అమృత వ్యతిరేకిస్తుండటంతో.. వర్మ సంప్రదింపులు మొదలుపెట్టినట్టు టాక్. అమృతతో రామ్ గోపాల్ వర్మ తన సన్నిహితులతో మాట్లాడించినట్టు సమాచారం. సినిమా తీయాలంటే మీ అనుమతి ఉండాలా … తీస్తానంటే మీరేమంటారు అని అమృత అభిప్రాయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐతే… తన జీవిత కథను సినిమాగా తీసే విషయంలో అమృత స్ట్రిక్ట్ గా ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఆమె తన కథను సినిమాగా తీయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోనంటున్నారు. ఈ విషయాన్ని ఫోన్ లైన్ లో మాట్లాడేందుకు కూడా ఆమె సుముఖంగా లేదని.. వర్మ సన్నిహితులు చెప్పారు. తన దగ్గర వర్మ ఫోన్ నంబర్ ఉందని.. అవసరమైతే తామే ఫోన్ చేస్తామని అమృత వర్మ సన్నిహితులతో చెప్పి ఫోన్ కట్ చేసినట్టు తెలుస్తోంది.

దీంతో… రామ్ గోపాల్ వర్మ నేరుగా అమృతతతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ కథలో బాధితురాలిగానే అమృ త ఉంటుందని..  ఓ తండ్రి సెంట్రిక్ గానే కథ నడుస్తుందని నచ్చజెప్పేందుకు ట్రై చేస్తున్నట్టు సమాచారం. బిడ్డపై తండ్రి స్వచ్ఛమైన ప్రేమను… కులం, ధనం ఆవహిస్తే.. అతడు సైకోగా ఎలా మారుతాడని.. చివరకు పశ్చాత్తాపంతో సూసైడ్ చేసుకుని తన జీవితాన్ని ఎలా ముగించుకుంటాడన్నది మాత్రమే ఉంటుందని వర్మ చెప్పదల్చుకున్నాడు. ఇందులో ప్రణయ్ బాధితుడే అని.. దృఢమైన అభిప్రాయాలున్న అమృత తన ప్రణయ్ జ్ఞాపకాన్ని, బిడ్డను ఎలా ముందుకు తీసుకెళ్తుందో మార్గదర్శిగా చూపించదల్చుకున్నాడు వర్మ. ఈ కథతో అమృతను కలిసి… ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

(Visited 368 times, 1 visits today)
Author: kekanews