జూనియర్ ఎన్టీఆర్ కు చెర్రీ రిటర్న్ గిఫ్ట్ ముచ్చట..!

Jr Ntr Ramcharan
Spread the love

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి కుటుంబ ఫ్యాన్స్ అందరూ ఇవాళ పండుగ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 37వ బర్త్ డే కావడంతో.. ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేస్కుంటున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆర్.ఆర్.ఆర్. మూవీ యూనిట్ ఏదైనా సర్ ప్రైజ్ ఇస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు.

ఐతే… ఆ సర్ ప్రైజ్ ను రామ్ చరణ్ ఇచ్చాడు. “మై డియర్ బ్రదర్ తారక్.. నీకు హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతున్నా.  నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చాను. చాలామంచి గిఫ్ట్ ఇస్తానని మరోసారి ప్రామిస్ చేస్తున్నా. మరిన్ని సంబరాలు మున్ముందు చేసుకుందాం” అంటూ రామ్ చరణ్ ట్విట్టర్ లో చెప్పాడు.

ఎన్టీఆర్ కు రామ్ చరణ్ ఇస్తానంటున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటనేది ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో చెర్రీ  పోస్ట్ వైరల్ అవుతోంది. #RamarajuWithBheem అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. #RRRమూవీలోని గెటప్స్ కు సంబంధించిన స్టిల్ కావడంతో.. చెర్రీ పోస్ట్ చేసిన ఫొటో ఆకట్టుకునేలా ఉంది. ఇద్దరూ వైట్ అండ్ వైడ్ ఔట్ ఫిట్ లో ఫ్యాన్స్ ను ఒక్కసారిగా ఎట్రాక్ట్ చేసేశారు. మరోవైపు.. యంగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఎన్టీఆర్ కు హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్పాడు.

(Visited 224 times, 1 visits today)
Author: kekanews