అమ్మ బర్త్ డే రోజు… చెర్రీ దొరికిపోయాడు!

RamCharan Look in RRR Movie
Spread the love

అప్ డేట్ సర్….

ఒక్క అప్ డేట్ ప్లీజ్…

ఒక్క స్టిల్..

ఒక్క న్యూస్..

ఒక్క ప్రివ్యూ..

కనీసం ఒక్క లీక్..

ఇలా.. ఏదో ఒకటి మా చెవిన పడేయండి సార్.. అభిమానులం అలా పడి ఉంటాం.. అంటూ.. RRR సినిమా కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్న అభిమానులు కోట్లాదిమంది ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి, కీరవాణి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ భారీ సినిమా .. అంతే భారీ హంగులతో ముస్తాబవుతోంది. మూవీకి సంబంధించిన ఏ న్యూస్ అయినా.. వైరల్ అయిపోతోంది. ఐతే.. మూవీలో గెటప్ ల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ఎలా ఉంటారు.. రామ్ చరణ్ ఎలా ఉంటారు అన్న ఆసక్తి అంతటా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత.. రామ్ చరణ్ కెమెరా ముందుకొచ్చాడు. అది కూడా వాళ్ల అమ్మ సురేఖమ్మ పుట్టినరోజు సందర్భంగా. ఈ సందర్భంగా.. కోర మీసాలతో ఉన్న రామ్ చరణ్ స్టిల్స్ ను చూసి అభిమానులు పొంగిపోతున్నారు.

పాత తరం మీస కట్టుతో.. రామ్ చరణ్.. మెగా అభిమానులకు కనువిందు చేశాడు. అమ్మతో అనురాగాన్ని చాటుకుంటూనే.. అభిమానులకు RRR వినోదం కూడా అందించాడు. జూన్ 30కి రావాల్సిన RRR రిలీజ్ డేట్ వాయిదాపడింది. వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలోకి దింపుతామని మేకర్స్ ప్రకటించారు. RRRకు సంబంధించిన అప్ డేట్స్… సమ్మర్ లో ఎండల్లో లాగా ఫ్యాన్స్ ను రగిలించడానికి వచ్చేస్తున్నాయన్నది లేటెస్ట్ టాక్.

(Visited 303 times, 1 visits today)
Author: kekanews