రామ్ RED టీజర్ రిలీజ్… మణిశర్మ BGM కేక

RAM RED MOVIE TEASE RELEASED
Spread the love

రామ్ హీరోగా నటించిన రెడ్ -RED మూవీ టీజర్ ఇండస్ట్రీని ఆకట్టుకుంటోంది. తమిళ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్లను తెలుగులో అందిస్తూ సక్సెస్ లు సాధిస్తున్నారు ఇక్కడి మేకర్స్. స్రవంతి మూవీస్ బ్యానర్ లో వస్తున్న రెడ్ మూవీ కూడా అలాంటిదే. అరుణ్ విజయ్ హీరోగా సూపర్ సక్సెస్ అయిన “Thadam” మూవీని రెడ్ గా రీమేక్ చేస్తున్నారు.

ఈ క్రైమ్ థ్రిల్లర్ టీజర్ తెలుగు ఇండస్ట్రీని అలర్ట్ చేసింది. నివేతా పెతురాజ్, మాళవిక శర్మ, అమృత కీలక పాత్రలు పోషిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ… టీజర్ తోనే అందరినీ ఆకట్టుకుంటోంది.

మణిశర్మ బీజీఎంతో దుమ్ములేపేశాడు

రెడ్ టీజర్ ను ఒక్కసారి చూస్తే.. రిపీట్ గా చూడాలన్నంత ఇంప్రెషన్ కలుగుతుంది. అందులో.. మణిశర్మ బీజీఎం హైలైట్ గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఇవ్వడంలో మాస్టర్ అనిపించుకున్న మణిశర్మ..మరోసారి.. రెడ్ తో అందరినీ రెడ్ అలర్ట్ చేసేశాడని అంటున్నారు మూవీ ఫ్యాన్స్.

 

(Visited 148 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *