కేక రివ్యూ : దర్బార్.. చూడొచ్చు ఏక్ బార్

rajinikanth-murugadoss-darbar-movie-review
Spread the love

రజినీకాంత్ సూపర్ స్టారే కానీ.. సూపర్ మ్యాన్ కాదు.. రజినీని సూపర్ మ్యాన్ లా చూపించి నేల విడిచి సాముచేయడం వేస్ట్. సూపర్ స్టార్ ఎప్పుడూ అలుముకున్న చీకట్లలోనే వెలిగిపోతూ ఉంటుంది. అలాంటి ‘దట్టమైన’కథ ఉన్నప్పుడే ఆ స్టార్ కు విలువ. మంచి కథ, లైన్ ఉన్న సినిమాకు రజినీ మేజిక్ తోడైతే.. ఆ తర్వాత కనిపించే వసూళ్ల సునామీ కళ్లు చెదిరేలా ఉంటుంది.  కానీ.. దర్బార్ లో ఆ లాజిక్ మిస్సయింది.

ఇటీవల రజినీకాంత్ తో చాలామంది సినిమాల చేశారు. ఆయన్ను అభిమానుల గుండెలో నిలిచిన దేవుడిగా.. రజినీనే హైలైట్ చేస్తూ చూపించారు తప్ప… అందరినీ మెప్పించేలా మాత్రం తీయలేకపోయారు. నిజానికి ఇలాంటి మేజిక్ లు ఇటీవల కాలంలో చేసి రజినీ స్టేటస్ ను నిలబెట్టినవాడు శంకర్ అనే చెప్పాలి.

శివాజీ, రోబో, 2.0 సినిమాలతో.. ఖతర్నాక్ మాస్, మసాలా అంశాలున్న కథలకు.. రజినీ స్టైల్ ను.. టెక్నాలజీని జోడించి.. అద్భుతాలు సృష్టించాడు శంకర్. టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ ఈసారి రజినీతో సినిమా తీస్తున్నాడనగానే.. అంలాంటిదేదో రిపీ అవుతుందున్నారు జనాలు. కానీ.. అలా జరగలేదు. మురుగదాస్ తన సొంత మార్క్ వదిలేసి… కేవలం రజినీ ఇమేజ్ చుట్టూ జపం చేశాడు.

డెబ్బయ్యేళ్ల రజినీ.. హీరోయిన్ తో ప్రేమ, పెళ్లి అంటూ వెంట పడ్డాడంటే… అది ఓ శివాజీలో శంకర్ చూపించినట్టుగా ఉండాలి. అందులో.. హీరో ప్రేమ, పెళ్లి హడావుడిని డామినేట్ చేసేంత కామెడీ ఉంటుంది. దర్బార్ లో నయనతారతో ఓ ఎపిసోడ్ వర్కవుట్ కాలేదు.

థియేటర్లోకి అప్పుడే వచ్చాం కాబట్టి.. ఫస్టాఫ్ రజినీ స్టైలింగ్, కొన్న  సీన్లతో అలా అలా గడిచిపోతుంది. ఇంటర్వెల్ ముందు సీన్ లో మురుగదాస్ ముద్ర కనిపిస్తుంది. విలన్ కొడుకుని తెలివిగా హీరో మట్టుబెట్టే ఎపిసోడ్ అదిరింది. ఆ తర్వాత ఆ జోరు కంటిన్యూ కాలేదు. కానీ.. సెకండాఫ్ లో హీరోకు సవాల్ విసిరే స్థాయిలో విలనీ లేకపోవడం పెద్ద మైనస్. రజినీ హిట్ సినిమాల్లో విలన్  దీటుగా ఉండటం వల్లే అవి బ్లాక్ బస్టర్ అయిన సంగతి దర్శకుడు మరిచిపోయినట్టున్నాడు. ఐనప్పటికీ.. మెట్రో స్టేషన్ ఫైట్ లాంటి ఒకట్రెండు సీన్లు ప్రేక్షకులకు బాగా రిజస్టర్ అయ్యాయి.

అనిరుధ్ పాటలు.. మళ్లీ రొడ్డకొట్టుడు లాగా అనిపించింది. శంకర్ సినిమాలు మినహాయిస్తే… ఇటీవల కాలంలో రజినీని కొంత బెటర్ గా చూపించిన డైరెక్టర్ మురుగదాస్ అనే చెప్పాలి. డెబ్బైల్లో రజినీ సినిమాటిక్ లుక్స్ ఫ్లేవర్ కోసం మాత్రం ఓసారి థియేటర్ లో చూడొచ్చు.

పంచ్ లైన్ : దర్బార్ చూడొచ్చు ఏక్ బార్

 

(Visited 108 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *