రాహుల్ సరిగ్గానే రాశాడు.. పప్పుగాళ్లదే ఈ క్రియేటివిటీ

fact-check-did-rahul-gandhi-call-sushant-singh-rajput-a-cricketer
Spread the love

రాహుల్.. సుషాంత్ ను ఏమన్నాడు.. అసలేం రాశాడో తెలుసా..

రాజకీయ నాయకులు పొరపాటు పడితే.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా ఉండదు. ఉతికి ఆరేస్తుంటారు సోషల్ ప్లాట్ ఫామ్ యూజర్స్.

రాహుల్ గాంధీని అయితే అస్సలు వదలరు. కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్ గాంధీ విషయంలో సందు దొరికితే చాకిరేవు పెట్టే బ్యాచ్ చాలా పెద్దదే ఉంది. లేటెస్ట్ గా అలాంటిదే జరిగింది.

బాలీవుడ్ ధోనీ.. యంగ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో రియాక్టయ్యాడు. టాలెంటెడ్ యాక్టర్ తొందరగా చనిపోయాడని.. అతడి మరణం పట్ల సానుభూతి ప్రకటిస్తున్నా అన్నారు. ఐతే.. రాహుల్.. సుషాంత్ ను.. టాలెంటెడ్ యాక్టర్ అని కాకుండా.. టాలెంటెడ్ క్రికెటర్ అని రాశాడంటూ ఓ పోస్ట్ వైరల్ అయింది. రాహుల్ గాంధీ తెలివితేటలు ఇలా ఉన్నాయంటూ రకరకాలుగా కథనాలు వచ్చాయి.

ఐతే.. Rahul Gandhi .. సుషాంత్ సింగ్ రాజ్ పుత్ పై పెట్టిన ట్వీట్ ను కేక న్యూస్ Fact Check చేసింది. రాహుల్ తప్పురాశాడంటూ వైరల్ అవుతున్న  పోస్ట్ … ట్విట్టర్ లో రాహుల్ పెట్టిన(పెట్టించిన) పోస్ట్ చెక్ చేసింది.

చూస్తే రెండు ట్వీట్లు సేమ్ టైమ్ లో పోస్ట్ అయ్యాయి. ఒకవేళ రాహుల్ .. సుషాంత్ ను క్రికెటర్ అన్నట్టుగా ఉన్న ట్వీట్ … యాక్టర్ అని ఉన్న ట్వీట్ సేమ్ టైమ్ చూపిస్తున్నాయి. ఒకవేళ పొరపాటు జరిగినా… కరెక్షన్ చేసుకోవడానికి కనీసం ఒక నిమిషం అయినా గ్యాప్ ఉండేది. కానీ.. రెండూ సేమ్ టై చూపిస్తున్నాయి.  అంత ఫాస్ట్ గా తప్పును సరిదిద్దారు అని అనుకోవడం అంత సమర్థనీయం కాదు. సో… రాహుల్ .. సుషాంత్ ను క్రికెటర్ అని రాశాడని వచ్చిన వార్త జస్ట్ ఫేక్ న్యూస్.

(Visited 191 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *